వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: బిట్ కాయిన్ ఎక్స్ఛేంజ్ చీఫ్ కిడ్నాప్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీగా పేరుగాంచిన బిట్ కాయిన్.. ఎక్స్ఛేంజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పావెల్ లెర్నర్(40) ఉక్రెయిన్‌లో కిడ్నాప్‌కు గురయ్యారు. ఆయన తన కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

నల్లటి మెర్సిడిజ్ బెంజ్ వాహనంలో వచ్చిన కొంతమంది దుండగులు లెర్నర్‌ను అపహరించినట్లు తెలుస్తోంది. లింక్డిన్ ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం మేరకు.. పావెల్ లెర్నర్ 2012లో రష్యాలోని కుర్స్‌క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు.

Bitcoin exchange chief kidnapped in Ukraine

పావెల్ ప్రముఖ బ్లాక్ చెయిన్ నిపుణుడు. ఆయన కిడ్నాప్ అయ్యారనే వార్తలు వెలువడడంతో ఇంటర్నేషనల్ క్రిప్టో కరెన్సీ కమ్యూనిటీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. బిట్ కాయిన్ వెబ్‌సైట్ కూడా తాత్కాలికంగా క్రాష్ అయినట్లు, పని చేయడం మానేసినట్లు సమాచారం.

అయితే బిట్ కాయిన్ వ్యాపారానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని, ఎక్స్ఛేంచ్ మామూలుగానే పనిచేస్తోందని, ఈ కిడ్నాప్ వ్యవహారం బిట్ కాయిన్ యూజర్ల లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడలేదని బిట్ కాయిన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

English summary
Pavel Lerner, 40, the chief executive of a UK-based Bitcoin exchange called EXMO has reportedly been kidnapped in Ukraine. He was abducted while leaving his office in Kiev's Obolon district. According to the local media reports, Lerner was kidnapped in a Black Mercedes-Benz by a group of men sporting balaclavas. As per Lerner’s LinkedIn profile, he graduated Kursk State University in Russia in 2012. He is a prominent Russian blockchain expert and the news of his kidnapping has stunned many in the international cryptocurrency community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X