వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాందేవ్ కరోనా కిట్ కు వరుస షాక్ లు- ప్రభుత్వాల నిషేధం, నెటిజన్ల ఫైర్- తెలియదన్న కేంద్రం..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ దానికి విరుగుడు అంటూ పతంజలి వ్యవస్ధాపకుడు బాబా రాందేవ్ తీసుకొచ్చిన కరోనా కిట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కిట్ ను సాధారణ జనంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరిస్తుండగా...కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో నెటిజన్లు రాందేవ్ బాబాను సామాజిక మాధ్యమాల్లో ఓ ఆటాడేసుకుంటున్నారు.

రాందేవ్ కరోనా కిట్ కు షాక్ లు..

రాందేవ్ కరోనా కిట్ కు షాక్ లు..

ప్రపంచవ్యాప్తంగా జనాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారికి మందు కనిపెట్టానంటూ హరిద్వార్ లో బాబా రాందేవ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పారో లేదో దీనిపై విమర్శలు మొదలైపోయాయి. దీనికి ప్రధాన కారణం కరోనాకు సంబంధించిన మందులు, వ్యాక్సిన్లు తయారు చేయలన్నా, వాటిపై ప్రయోగాలు చేయాలన్నా తమ అనుమతి తప్పనిసరని కేంద్రం ఏప్రిల్ 11న జారీ చేసిన ఓ ప్రకటనే. రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్ధ అలాంటి అనుమతులేవీ తీసుకోకుండానే కరోనా మందులు తయారు చేయడంతో పాటు మార్కెట్లోకి కూడా విడుదల చేసేసింది.

రాష్ట్ర ప్రభుత్వాలు నో....

రాష్ట్ర ప్రభుత్వాలు నో....


కరోనాకు మందుగా చెప్పుకుంటూ రాందేవ్ బాబా విడుదల చేసిన కిట్ లో కరోలిన్ ట్యాబ్లెట్లను దగ్గుకు మందుగా చెప్పుకుంటూ విడుదల చేశారు. ఆ తర్వాత ఇది కరోనా అంటూ ప్రచారం, ప్రకటనలు విడుదల చేయడంతో ప్రభుత్వాలు అవాక్కయ్యాయి. ఇలాగే తాము కూడా మోసపోయామంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాందేవ్ కు నోటీసులు పంపుతుండగా... మహారాష్ట్ర అయితే తాము రాష్ట్రంలోకి ఈ కరోలిన్ ట్యాబ్లెట్లను అనుమతించేదే లేదని తేల్చిచెప్పింది. రాజస్ధాన్ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మిగతా ప్రభుత్వాలు కూడా కరోనా కిట్ వ్యవహారంపై నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.

కేంద్రం, డ్రగ్ కంట్రోలర్ల మౌనం....

కేంద్రం, డ్రగ్ కంట్రోలర్ల మౌనం....

రాందేవ్ బాబా కరోనా కిట్ పేరుతో హంగామా చేస్తున్నా కేంద్రం మాత్రం ఈ వ్యవహారంపై అమాకత్వమే నటిస్తోంది. రాందేవ్ తమ వద్ద కరోనా మందు తయారీకి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెబుతూనే, కరోనా కిట్ విడుదలైన వ్యవహారం తమకు తెలియదంటూ ఆయుష్ శాఖ ప్రకటించడం ఆశ్చర్యంగా మారింది. అటు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ కూడా దీనిపై ఇప్పటివరకూ స్పందించలేదు. కరోలిన్ ట్యాబ్లెట్ల తయారీకి అనుమతి లేదని కేంద్రం ప్రకటించాక కూడ సంబంధిత సంస్ధలు దీనిపై చర్యలకు ఉపక్రమించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కరోలిన్ కు చట్టబద్థత ఉందా ?

కరోలిన్ కు చట్టబద్థత ఉందా ?


కరోనా వైరస్ కు విరుగుడుగా రాందేవ్ బాబా చెబుతున్న కరోలిన్ మందుకు తయారీకి ఉన్న చట్టబద్ధతపైనా సర్వత్రా అనుమానాలే. కరోనా లక్షణాలు స్వల్పంగా, ఓ మోస్తరుగా ఉన్న వంద మందిపై ట్రయల్స్ నిర్వహిస్తే అందులో 65 మంది కోలుకున్నట్లు రాందేవ్ చెబుతుండగా... ఈ ట్రయల్స్ నమ్మశక్యంగా లేవని దేశంలో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో ఏదైనా మందు ట్రయల్స్ కనీసం 220 మందిపై నిర్వహించాలని, కానీ కేవలం వందమందిపై ట్రయల్స్ తోనే ఓ డ్రగ్ ను మార్కెట్లో విడుడల చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. కరోనా కిట్ పై పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. అయినా కేంద్రం మాత్రం స్పందిస్తున్న దాఖలాలు లేవు.

ఆడుకుంటున్న నెటిజన్లు....

ఆడుకుంటున్న నెటిజన్లు....

పతంజలి సంస్ధ విడుదల చేసిన కరోనా కిట్ పై కేంద్రం, డ్రగ్ అథారిటీ స్పందించకున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సాధారణ ప్రజలు కూడా మండిపడుతున్నారు. ముఖ్యంగా నెటిజన్లు రాందేవ్ ఫేక్ మందుపై విపరీతంగా ఆడుకుంటున్నారు. దగ్గు మందు పేరుతో అనుమతులు తీసుకుని కరోనా మందంటూ ఎలా ప్రచారం చేస్తారని కొందరు మండిపడుతున్నారు. రాందేవ్ ఇలా మోసం చేస్తుంటే కేంద్రం స్పందించకపోవడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా రాందేవ్ బాబా కనిపెట్టిన కరోనా డ్రగ్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

English summary
ramdev baba's coronavirus kit getting bitter response from various state governments in the country and in some where cases also registered against the kit also. in internet also netizens viral zokes on this kit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X