వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో దారుణం : కూతురి మృతదేహంతో జీవనం, పోలీసులకు ఫిర్యాదు ...

|
Google Oneindia TeluguNews

మిర్జాపూర్ : కూతురిపై పిచ్చి ప్రేమో .. లేక నిజంగా పిచ్చో తెలియదు కానీ తమ బిడ్డ చనిపోయిన దహన సంస్కారాలు చేయలేదు. దాదాపు నెలరోజుల నుంచి కలిసే ఉంటున్నారు. మృతదేహం వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కూతురు మృతి .. అయినా ...
యూపీలోని మిర్జాపూర్‌కు చెందిన ఓ రిటైర్డ్ పోలీసు అధికారి తన కుటుంబంతో కలసి ఉంటున్నారు. హయత్‌నగర్ దిలావర్ సిద్దిఖీ నివాసంలో ఉంటున్నారు. భార్య, కూతురితోపాటు ఆయన నివసిస్తున్నారు. ఇంతవరకు ఓకే .. కానీ ఆ కూతురు జీవచ్చవంలా పడి ఉండటమే అనుమానాలకు దారితీస్తోంది. చనిపోయిన కూతురు మృతదేహం వాసన రావడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. అయితే ఎంతకీ తగ్గకపోవడంతో ఏం జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు.

bizare incident in up .. parents live in daughter deadbody

నెలరోజుల నుంచి ...
స్థానికుల సమాచారం అందుకొని రిటైర్డ్ పోలీసు ఇంట్లోకి పోలీసులు వచ్చారు. ఇంట్లో సోదాలు నిర్వహించగా ఓ కూళ్లిన శవం లభించింది. ఇది వారి కూతురిగా పోలీసులు గుర్తించారు. ఏం జరిగిందని పోలీసులు విచారించగా .. తమ కూతురు చనిపోలేదని, తమతో నిద్రపోతుందని చెప్పడంతో నోరెళ్లబెట్టారు. తాము అంతా కలిసే ఉన్నామని .. తమకు ఎలాంటి వాసన రాలేదని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. దీంతో ఇరుగుపొరుగు వారిని పిలువగా .. వారు కొంచెం తేడాగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. దీంతో ఆ దంపతులే హత్య చేశారా ? లేక చనిపోయినా కూతురితో ఉన్నారా అనే విషయం తేలాల్సి ఉంది. డెడ్ బాడీనీ పోస్టుమార్టం కోసం పంపించామని, నివేదిక వచ్చాక మృతికి గల కారణం తెలుస్తుందని పేర్కొన్నారు.

English summary
A retired police officer from Mirzapur in UP is staying with his family. He is staying at Diyawar Siddiqui's residence in Hayatnagar. He lives with his wife and daughter. but the daughter is still not alive. The neighbors were suspicious as the daughter's body smelled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X