వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: బీర్ ట్యాంకులో మూత్రం.. 12 ఏళ్లుగా ఓ ఫ్యాక్టరీ ఉద్యోగి నిర్వాకం.. చివరికి ఏమైందంటే..

|
Google Oneindia TeluguNews

సంతోషానికైనా, విషాదానికైనా చాలా మందికి రెండు గుక్కల మందు కావాల్సిందే. ఓ దిక్కు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా వైన్ షాపుల ముందు బాబుల సందడి ఏమాత్రం తగ్గడంలేదు. ఈ విషయంలో ఇండియా, ఇంగ్లాండ్ అనే తేడాలు లేవు.. ఆఫ్రికా నుంచి అమెరికా దాకా అన్ని ఖండాల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో కంటే జనం మందు కోసం మరింతగా వెంపర్లాడుతోన్న సమయంలోనే ఓ షాకింగ్ న్యూస్ ప్రపంచాన్ని షేక్ చేసింది. మందుబాబులు ఎంతో ఇష్టంగా సేవించే బీరులో మూత్రం కూడా కలుస్తోందన్న ఆ వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి.

Recommended Video

Fact check: Did a Budweiser Employee Pee In The Beer Tanks? | చివర్లో అసలు ట్విస్ట్ || Oneindia

ఫిర్యాదు కోసం స్టేషన్‌కు తల్లీకూతుళ్లు.. వాళ్లను చూస్తూ ఎస్ఐ హస్తప్రయోగం.. రూ.25వేల రివార్డు..ఫిర్యాదు కోసం స్టేషన్‌కు తల్లీకూతుళ్లు.. వాళ్లను చూస్తూ ఎస్ఐ హస్తప్రయోగం.. రూ.25వేల రివార్డు..

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

ప్రపంచ ప్రఖ్యాత బడ్ వైజర్ బ్రాండ్ కు అమెరికాలోని కొలరాడోలో పెద్ద ప్లాంట్ ఉంది. ఆ దేశానికి కావాల్సిన బీరులో అధిక శాతం ఆ ప్లాంటు నుంచే ఉత్పత్తి అవుతోంది. అయితే, అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగి ఒకరు.. తాను గత 12 ఏళ్లుగా ఫ్యాక్టరీలోని బీర్ ట్యాంకులో మూత్రం పోస్తున్నట్లు అంగీకరించడం కలకలం రేపింది. తన అసలు పేరును బయటపెట్టకుండా బీరు ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఘటనల్ని వివరిస్తూ ఆ ఉద్యోగి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చదివిన చాలా మందికి వాంతిచేసుకోవడమే తక్కువైంది.

ఎందుకా పని చేశాడంటే..

ఎందుకా పని చేశాడంటే..

కొలరాడోలోని ఫోర్ట్ కొలిన్స్ సిటీలో గల బడ్ వైజర్ బీరు ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న తనను వాల్టర్ పావెల్ గా పరిచయం చేసుకున్న ఆ ఉద్యోగి.. మొదట్లో ట్యాంకు కింది భాగంలో నీళ్లు కలిపే పని చేసేవాడినని, ప్లాంట్ లో సీనియర్లతో పరిచయం పెరిగిన తర్వాత పైభాగంలో పని చేసే అవకాశం లభించిందని తెలిపాడు. ‘‘12 ఏళ్లుగా బీర్ ట్యాంకులో మూత్రం ఎందుకు పోశావని నిలదీస్తే నా దగ్గర కచ్చితమైన సమాధానం లేదు. ఆ పని ఎందుకు చేశానో నాకే తెలీదు. బేసిగ్గా నాకు బద్ధకం ఎక్కువ. వాష్ రూమ్ కోసం అంత దూరం వెళ్లాలా? అనిపించేది, ప్రకృతి ఎప్పుడు పిలిచినా ట్యాంకులోనే పని కానిచ్చేవాడిని.. ''అంటూ వికృతపర్వాన్ని వివరిస్తాడు పావెల్.

జనం తాగుతుంటే చూసి..

జనం తాగుతుంటే చూసి..

తాను మూత్రం కలిపిన బీర్లను జనం తాగుతుంటే చూసి నవ్వుకునేవాడినని, వాళ్ల అమాయకత్వాన్ని తలుచుకుంటూ ఆనందించేవాడినని పావెల్ చెప్పుకొచ్చాడు. ఓసారి ఇంటివాళ్లే బడ్ వైజర్ బీరు తీసుకొచ్చి తాగమన్నప్పుడు.. అక్కణ్నుంచి తప్పించుకోడానికి కష్టపడాల్సి వచ్చిందన్నాడు. అయితే, ఫోర్ట్ కొలిన్స్ లోని ప్లాంటులో మాత్రమే ఇది జరిగిందని, కంపెనీకి సంబంధించిన మిగతా ఫ్యాక్టరీల్లో తయారయ్యేది స్వచ్ఛమైన బీరే అని, ఆ విషయంలో తాగేవాళ్లకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని సంస్థ ఉద్యోగి తెలిపాడు.

చివరికి ఏం తేలిందంటే..

చివరికి ఏం తేలిందంటే..

బీరు ట్యాంకులో 12 ఏళ్లుగా మూత్రం పోస్తున్నానని అంగీకరించిన తర్వాత కూడా సదరు ఉద్యోగిని కంపెనీ తొలగించలేకపోయిందని, అసలు పేరు బయటపెట్టకపోవడం ద్వారా అతను శిక్ష నుంచి తప్పించుకున్నాడని వార్తలు వచ్చాయి. ఫోర్ట్ కొలిన్స్ లోని బడ్ వైజర్ ప్లాంటులో సుమారు 800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదీగాక అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే కంపెనీలో ఓ ఉద్యోగి ఇంత సులభంగా.. అది కూడా 12 ఏళ్లపాటు ట్యాంకులో మూత్రం పోయడం సాధ్యమేనా? అనే అనుమానాలూ వ్యక్తమయ్యాయి. చివరికి ఫ్యాక్ట్ ఫైండర్లు కొందరు ఇది ఫేక్ న్యూస్ అని తేల్చారు. ఫూలిష్ హ్యూమర్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ సరదాగా క్రియేట్ చేసిన ఈ వార్త అంతటా కలకలం రేపింది. తమ కంపెనీ పేరు మీద ఇంత పెద్ద దుమారం చెలరేగడాన్ని బడ్ వైజర్ సంస్థ లైట్ తీసుకుంది. మందుబాబులపై తయారీదార్లకు అంత నమ్మకం మరి!

English summary
news of Budweiser Employee gone viral after a web site published his statement that he has been Peeing In Beer tanks For 12 Years in Fort Collins, colorado. later on it was found as fake news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X