కొడుకు లైంగికదాడి.. వీడియో తీసిన తల్లి... ఆ తర్వాత బెదిరించి....
రాయ్‌పూర్/ బలోడా బజార్ : అవును ఇది కలికాలమే. సమాజంలో మంచి, మర్యాద లేదు, గౌరవం అన్న మాటే లేదు. సంబంధ, బంధవ్యాలు కూడా విలువలేకుండా పోతోంది. ఏదో సినిమాలో కవి రాసినట్టు 'మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు' అన్నట్టు ప్రస్తుత సమాజంలో పరిస్థితి ఉంది. దీనికి అద్దం పట్టేటట్టు ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఘటన జరిగింది. ఓ యువతిని ట్రాప్ చేసి కుమారుడు లైంగికదాడి చేయగా .. అతని కన్న తల్లి వీడియో తీసిన ఘటన కలకలం రేపుతోంది. ఇదేమి విచిత్రమని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
మత్తిచ్చి .. ఆపై పాడు పని ...
బలోడా బజార్‌కు చెందిన ఓ యువకుడు .. యువతితో సన్నిహితంగా మెలిగాడు. ఆమెను ప్రేమలో దింపాడు. నిజానికి యువతి కూడా అతడిని నమ్మింది. ఒకసారి ఇంటికి కూడా వచ్చింది. అసలే పాడు ఆలోచనతో యువకుడు ఉన్నాడు. ఇందుకు అతని తల్లి కూడా సహకరించింది. యువతికి ఇచ్చిన ఆహారంలో మత్తు మందు కలిపింది. ఇంకేముంది ఆమె మత్తులో ఉండగా లైంగికదాడి చేశాడు. అతను లైంగికదాడి చేస్తుండగా .. అతని సొంత తల్లి వీడియో తీసింది.
తల్లే వీడియో తీసింది ...
ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడుతుండగా తల్లి వీడియో తీయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుమారుడికి మంచి మాటలు చెప్పాలి, నడవడిక నేర్పించాల్సిన తల్లి .... తప్పుదారి పడుతున్న కుమారుడి చేష్టలకు సాక్షిభూతంగా నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ యువతిపై లైంగికదాడి చేసిన వీడియోను తమ వద్ద పెట్టుకున్నారు. ఆ యువకుడు సోదరి, బావ రంగంలోకి దిగారు. బాధిత యువతికి వీడియో చూపిస్తూ బెదిరింపులకు దిగారు. మెల్ల మెల్లగా డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు. అలా రూ.4 లక్షలు ముక్కుపిండి వసూల్ చేశారు. ఆ యువతి నగదును ఇంటిలోంచి తీసి ఇచ్చింది.
భూమి విక్రయించిన నగదు ఇలా ...
ఇటీవల తన తండ్రి భూమి అమ్మడంతో వచ్చిన మొత్తం ఆ నగదు. భూమి అమ్మితే రూ.6 లక్షలు వచ్చాయి. వాటిని జాగ్రత్తగా దాచిపెట్టాలని ఇస్తే .. ఆ యువతి అందుల్లోంచి తీసింది. చివరికి ఒకరోజు నగదు ఇవ్వమంటే రూ.2 లక్షలే ఉన్నాయి. మిగతా రూ.4 లక్షలు లేకపోవడంతో ఏమయ్యాయని అడిగితే జరిగిన దారుణం గురించి తెలిపింది. ఓ యువకుడు తనను మోసం చేశాడని చెప్పడంతో ... యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లైంగికదాడి చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.