• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

lockdown:జీతం కోసం 12 కి.మీ నడిచి, రూ.11 వేలు తీసుకొస్తే.. అడ్డగించి దోచుకెళ్లిన దుండగులు...

|

కరోనా వైరస్ తీసుకొచ్చిన తంటాతో పనిలేదు. ఉన్న కొద్దీ డబ్బుతో ఇల్లు గడవడమే కష్టం. అలాంటి క్లిష్ట సమయంలో అతని వద్ద ఉన్న నగదు అయిపోయింది. ఇంట్లో ఉన్న పిల్లల పాల కోసం యజమానిని డబ్బులు అడిగాడు. కానీ అతను ట్రాన్స్ ఫర్ చేయడం వీలుకాదు.. నగదు ఇస్తానని చెబితే ఒకటి కాదు రెండు కాదు.. 12 కిలోమీటర్లు ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ కాసేపు నిరీక్షించి.. అతను కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకపోయినా.. ఇచ్చినా డబ్బు తీసుకొని వచ్చాడు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనే లోపు ముగ్గురు దుండగులు రూపంలో యమకింకరులుగా మారారు.

రూ.5 వేలు..

రూ.5 వేలు..

తూర్పు ఢిల్లీ కైలాస్ నగర్‌లో రాజేంద్ర సింగ్ ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సాదర్ బజార్ కాస్మొటిక్ షాపులో పనిచేసేవాడు. అయితే మార్చి 24వ తేదీన లాక్ డౌన్ విధించేముందు రాజేంద్ర సింగ్ వద్ద 5 వేలు ఉండేవి. కానీ ఏప్రిల్ మొదటివారం వరకు ఆ నగదు దాదాపుగా అయిపోయాయి. దీంతో తన యజమానిని డబ్బులు అడిగాడు. అతను నగదు చేతికి ఇస్తానని చెప్పడంతో ఆదివారం తన ఇంటి నుంచి బయల్దేరాడు. మరొ కొలిగ్‌తో కలిసి ఉత్తర ఢిల్లీ మోడల్ టౌన్‌కు చేరుకున్నాడు. ఇందుకోసం దాదాపు మూడు గంటల సమయం పట్టింది. కానీ అక్కడికెళ్లాక యజమాని సరిగ్గా పట్టించుకోలేదు. భోజనం కాదు కదా.. మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. కాసేపు వెయిట్ చేయించాక.. రాజేంద్ర సింగ్‌కు రూ.6 వేలు, చందన్ పాశ్వాన్‌కు రూ.5 వేలు అందజేశాడు.

రూ.11 వేలు తీసుకొని..

రూ.11 వేలు తీసుకొని..

నగదు తీసుకొని వారు బయల్దేరారు. ఆ డబ్బులతో తమ సమస్యలు తీరతాయని అనుకొన్నాడు. కానీ దుండగుల రూపంలో అడ్డొచ్చారు. శాస్త్రి పార్క్ వద్ద గల ట్రాఫిక్ జంక్షన్ వద్ద మధ్యాహ్నం 3.30 గంటలకు ఆగారు. కాళ్ల నొప్పులు రావడంతో కాసేపు అగడమే వారు చేసిన పాపమైపోయింది. ముగ్గురు దుండగులు కత్తి తీసి బెదిరించడం ప్రారంభించారు. తాము దినసరి కూలీలమని.. వదిలేయాలని కోరారు. అయినా వినిపించుకోలేదు.. జేబులను చెక్ చేశారు. పాయింట్ జేబులు చెక్ చేయగా రూ.11 వేలు దొరికాయి. వారి వద్ద ఉన్న ఫోన్లను కూడా లాక్కున్నారు. సింగ్ వద్ద గల రూ.100 కూడా తీసుకోవడమే గాక దాడిచేశాడు. దీంతో సింగ్ కన్నుకు కూడా గాయమైంది.

స్నేహితుడితో కలిసి..

స్నేహితుడితో కలిసి..

సమీపంలో గల పాశ్వాన్ ఆంకుల్ ఇంటికి వెళ్లారు. అతని ఫోన్ నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టేషన్ కు రావాలని కోరడంతో శాస్త్రినగర్ పార్క్ పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి 9 గంటల వరకు ఉంచుకున్నారు. కనీసం తమకు తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. పైగా తిట్టారని.. ఎందుకు కంట్రోల్ రూం‌మ్‌కు ఫోన్ చేయలేదని బెదిరించారని వాపోయారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులను వివరణ కోరగా.. ఘటనపై దర్యాప్తు జరిపిస్తున్నామని తెలిపారు. వారి నగదును ఇప్పిస్తామని డీసీపీ డీకే గుప్తా పేర్కొన్నారు.

  Watch : Indian Origin Doctor In US Honored In Front Of Her House With A Parade
  English summary
  Rajendra Singh and Chandan Paswan walked 12 kilometres from east Delhi’s Kailash Nagar to north Delhi’s Model Town on Sunday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X