వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూరిన్ పోసి వీడియో: ఆరుగురు కలిసి పైశాచిక ఆనందం, కాళ్లు కట్టేసి వీడియో.. ఒంటిపై గాయాలు..

|
Google Oneindia TeluguNews

వేడుక కోసం ఇంటి నుంచి బయల్దేరిన అతని ఆచూకీ తెలియలేదు. సాయంత్రం అవుతోన్నా ఇంటికి రాకపోవడంతో పేరంట్స్‌కు ఒక్కటే టెన్షన్. బాబు కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ చేయగా.. వారు కూడా గాలించారు. కానీ ఫలితం లేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ యువకుడు నగ్నంగా పడి ఉండగా, ఒంటిపై గాయాలు కనిపిస్తున్నాయి. ఆరుగురు యవకుల బృందం అచేతనంగా పడి ఉన్న యువకుడిపై యూరిన్ పోస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న క్లిప్పింగ్ కనిపించింది. ఆ వీడియో చూసిన పేరెంట్స్ గుండె తరుక్కుపోయింది.

 కిడ్నాప్ అని..

కిడ్నాప్ అని..

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మజ్రీలో భారతి గౌతమ్ అవచ్చారే (49) కుటుంబం ఉంటోంది. గోపాల్ పట్టి ప్రాంతంలో గల వరద్ వినాయక్ సొసైటీలో కుమారుడు శ్రేయాస్ గౌతమ్ అవచ్చారే (15)తో కలిసి ఉంటున్నారు. తమ కాలనీలో శివ జయంతీ నిర్వహిస్తుండటంతో శ్రేయాస్ ఇంటి నుంచి వెళ్లాడు. కానీ ఆ మరునాడు కూడా తిరిగిరాలేదు. దీంతో అతని తల్లి భయాందోళనకు గురయ్యారు. యువకుడి స్నేహితులతో కలిసి గాలించారు. కానీ ఆచూకీ గుర్తించలేకపోయారు. హదాస్‌పూర్ పోలీసు స్టేషన్‌లో గత గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా అని భావించారు.

వీడియో వైరల్..

వీడియో వైరల్..

యువకుడి కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రోల్ అవుతోంది. వీడియోలో యువకుడు బట్టలు లేకుండా ఉన్నారు. కాళ్లు కట్టివేసి కనిపించాయి. అంతకుముందే దారుణంగా కొట్టినట్టు గాయాలు కనిపించాయి. యువకుడు ఎదురుగా ఆరుగురు కత్తి పట్టుకొని ఉన్నారు. సృహలో లేని యువకుడిపై యూరిన్ కూడా పోసి పైశాచిక ఆనందం పొందారు. వీడియో చూసిన భారతీ.. తమ కుమారుడేనని గుర్తించారు. మంజ్రీ రైల్వే ట్రాక్ వద్ద సృహలేకుండా అతను పడి ఉండటంతో సాసున్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

నలుగురి అరెస్ట్..

నలుగురి అరెస్ట్..

యువకుడిపై దాడి చేసింది ఆరుగురు అని పోలీసులు గుర్తించారు. వారిలో వినిత్ సూర్యాకాంత్ బిరాదర్, శుభం రాజభవు జాదవ్, దేవిదాస్ ఘన్‌శ్యామ్ పావ్‌హానే, భారత్ విశాల్ రాథోడ్ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరితో శ్రేయాస్‌కు ఇదివరకు గొడవ జరిగిందని పోలీసులు వివరించారు. శివ జయంతి సందర్భంగా పక్కనే యువకులు మద్యం సేవించి ఉన్నారని... అక్కడ కనిపించిన యువకుడిని పక్కకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.

Recommended Video

Coronavirus In Hyderabad : 3 More Suspects Positive Cases In Hyderabad | Oneindia Telugu
గొడవ జరగడంతోనే..

గొడవ జరగడంతోనే..

ఆరుగురితో శ్రేయాస్ గొడవ పడ్డారని.. కానీ వారు దారుణంగా దాడిచేసి.. బట్టలు విప్పేసి, మూత్రం పోశారని పోలీసులు వివరించారు. నలుగురిని కస్టడీలోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. వీరిపై కిడ్నాప్, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు.

English summary
teenager was admitted to the intensive care unit of Sassoon General Hospital on Thursday after he was undressed, bound, assaulted and urinated upon by a group of six men in Hadapsar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X