భర్త రూప రాక్షసుడు: కంటిపై కొట్టి, చేయి తిప్పి, పక్కటెముకల్లో గుద్ది.. వివాహితకు చిత్రహింసలు
భర్త.. భార్యకు సర్వస్వం. కన్నవారిని, తనవారిని వదిలి పుట్టింటి నుంచి మెట్టింటికి అడుగిడిన ఇల్లాలిని అర్థంచేసుకోవాలి. బాగా చూసుకోవాలి. మన కళ్ల ముందు, దగ్గరలోనే ఉంటే ఫరవాలేదు. అదే విదేశాల్లో ఉంటే.. వారికి నరకం అంటే ఏంటో చూపించే భర్తలు కూడా కొందరు ఉన్నారు. అచ్చం ఇలాంటి ఘటనే దుబాయ్‌లో ఒకటి జరిగింది.

కాపురంలో కలహాలు
బెంగళూరుకు చెందిన జస్మిన్ సుల్తాన్ బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేస్తుండేవారు. 2013లో ఆమెకు మహ్మద్ ఖిజర్ ఉల్లాహ్తో వివాహామైంది. పెళ్లయ్యాక వారిద్దరూ దుబాయ్ వెళ్లిపోయరు. షార్జాలో ఉంటున్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా తర్వాత కాపురంలో కలహాలు ప్రారంభమయ్యాయి.

టార్చర్ అంటే ఇదీ..
ఇంకేముంది జస్మిన్‌కు వేధింపులు ప్రారంభమయ్యాయి. ఏదో విషయంలో, ఊరికే గొడవలు స్టార్టయ్యాయి. మాటలతో సరిపెడితే ఏదో అని సర్దుకుంటారు కొందరు మహిళలు. కానీ మహ్మద్ చేతులకు పనిచెప్పాడు. జస్మిన్‌కు నరకం అంటే ఏంటో చూపించాడు. ప్రతీ నిత్యం ఆమెను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. అతని వేధింపులు తాళలేక స్వదేశం వద్దామని జస్మిన్ డిసైడ్ అయ్యేవరకు నరకం చూపించాడు.

కళ్లల్లోంచి నీరు కాదు రక్తం..
జస్మిన్ కంటిపై కొట్టడంతో కంటి నుంచి నీరుకు బదులు రక్తం కారుతుంది. చేయి విరగడంతో అచేతనంగా ఉండిపోయింది. పక్కటెముకలపై దాడి చేయడంతో.. ఇక తన పని అయిపోయిందని అనుకొంది. తాను చనిపోయానని భావించింది. కానీ ఎక్కడో కొన ఊపిరి ఉండటంతో బతికి బయటపడింది.

ట్వీట్ చేయడంతో..
కానీ భర్త బారి నుంచి బయటపడే మార్గం అన్వేషించింది. తన గాయాలతోనే ట్వీట్ చేసింది. తన వివరాలు వెల్లడించి, భర్త వేధిస్తున్నాడని.. ఇండియా పంపించాలని 15 సెకన్ల వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆమె పోస్టుకు స్పందన లభించడంతో భర్త బారి నుంచి బయటపడింది.

జస్మిన్‌కు సాయం..
ఆమె వీడియో పోస్ట్ చేయడంతో ఇండియన్ కాన్సులేట్ స్పందించింది. విషయాన్ని దుబాయ్ పోలీసులకు సమాచారం అందించింది. వారి రంగంలోకి దిగి ఏం జరిగిందని ఆరాతీశారు. విచారణకు హాజరుకావాలని మహ్మద్‌ను ఆదేశించారు. జస్మిన్ను ఇండియా పంపించే ఏర్పాట్లు చేసింది. తనకు పున:ర్జన్మ ప్రసాదించిన షార్జా పోలీసులు, ఇండియన్ కాన్సులేట్‌కు జస్మిన్ థాంక్స్ చెప్పింది. తాను, తన పిల్లలు క్షేమంగా బెంగళూరు వెళ్లేట్టు చూడాలని మరో ట్వీట్ చేసింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!