వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను గొడ్డలితో నరికి.. పారిపోతున్న భర్తపై మూకదాడి... వారిద్దరూ...

|
Google Oneindia TeluguNews

యూపీలో దారుణం జరిగింది. ఫతేఫూర్ జిల్లా ఘజిపూర్ పోలీసు‌స్టేషన్ పరిధిలో నిసార్ ఖురేసి అనే వ్యక్తి రెచ్చిపోయాడు. తన భార్యతో గొడవకు దిగాడు. వారి మధ్య మాట మాట పెరిగింది. తనతో తెచ్చుకున్న గొడ్డలిని బయటకుతీశాడు. ప్రాణభయంతో ఆమె పరుగులు తీసింది. అడ్డొచ్చిన మరదలు, అత్తపై కూడా దాడిచేశాడు.

యూపీలో దారుణం..

యూపీలో దారుణం..

ఛత్తీస్‌ఘడ్‌కి చెందిన ఖురేషి.. యూపీకి చెందిన అఫ్సారీని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత బాగానే ఉన్న వీరు.. తర్వాత గొడవలు పెరిగిపోయాయి. దీంతో భార్యభర్తలు ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం అత్తగారింటికీ ఖురేషీ వచ్చాడు. ఏదో విషయంలో గొడవ జరిగింది. భార్యను ఎలాగైనా మట్టుబెట్టాలనుకొని తనతో గొడ్డలిని కూడా తీసుకొచ్చాడు. భార్యపై గొడ్డలితో దాడిచేశాడు. భర్త చేతిలో దాడికి గురైన అఫ్సారీ చనిపోయింది.

భార్యపై గొడ్డలితో దాడి..

భార్యపై గొడ్డలితో దాడి..

అఫ్సారీపై దాడి చేసే సమయంలో ఆమె సోదరి, తల్లి అడ్డుకున్నారు. కానీ ఖురేషీ మాత్రం దాడి చేయడంతో.. ఆమె చనిపోయింది. అడ్డుకోబోయే క్రమంలో సోదరి, తల్లికి కూడా గాయాలయ్యాయి. దాడిచేసి.. అఫ్సారీ మృతిచెందిందని నిర్ధారించుకున్న తర్వాత పారిపోయాడు. కుటుంబసభ్యుల అరుపులతో ఖురేషీని స్థానికులు పట్టుకొన్నారు. గొడ్డలితో దాడిచేశారని తెలుసుకొని కొట్టడంతో ఖురేషీ కూడా చనిపోయాడు.

వీడియో హల్‌చల్..

వీడియో హల్‌చల్..

యూపీలో బుధవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు సోదరుడు అష్పాక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఖురేషీ పోస్టుమార్టం నివేదికను కూడా వైద్యులు అందజేశారు. తలకు తీవ్రగాయాలవడంతో చనిపోయారని నిర్ధారించారు. నోటిపై తీవ్రంగా గాయాలు ఉన్నాయని.. ఎముకలు ఎక్కడికక్కడ విరిగిపోయాయని పేర్కొన్నారు.

ఎవరినీ వదలిపెట్టం..

ఎవరినీ వదలిపెట్టం..

మృతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఫతేపూర్ ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశామని వివరించారు. ఖురేషీ భార్యను ఎందుకు హతమార్చాడనే విషయం విచారణలో తేలుతుందని చెప్పారు. దాడిచేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

English summary
A man was beaten to death by a mob in Uttar Pradesh’s Fatehpur district when he tried to flee after killing his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X