వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురి హత్య: కస్టడీకి 18సింహాలు, ‘జీవిత ఖైదు’!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. ముగ్గురిని హ‌త్య చేసిన కేసులో 18 సింహాల‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీటిలో ఆ నేరం చేసిందేవే తెలియదు. అయితే, అవి ఏదో తేలితే వాటికి జూలో జీవిత‌ఖైదు శిక్ష విధించేందుకు సిద్దమయ్యారు.

అక్క‌డ దొరికిన పంజా గుర్తుల ఆధారంగా ఈ 18 సింహాల‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి క‌స్ట‌డీలో ఉంచారు. వీటి ముఖాలు, పంజా గుర్తుల‌ను స‌రిచూసి నేరం చేసిన సింహాన్ని ప‌సిగ‌ట్ట‌నున్నారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్‌లో కూడా కథనాలు రావడం గమనార్హం.

lion

'హ‌త్య చేసింది ఏ సింహ‌మో మేము దాదాపుగా గుర్తించాం, కానీ మ‌రో 9 సింహాల ఫ‌లితాలు కూడా చూసిన త‌ర్వాత దానికి శిక్ష విధిస్తాం' అని గుజ‌రాత్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ జేఏ ఖాన్ వెల్ల‌డించారు.

నేరం చేసిన దానిని జూకి త‌ర‌లించి, మిగ‌తా వాటిని గిర్ అభ‌యార‌ణ్యంలో వ‌దిలేస్తామ‌ని తెలిపారు. గుజ‌రాత్‌లో 400 వ‌ర‌కు ఆసియా సింహాలు ఉన్నాయి. అయితే గిర్ అభ‌యార‌ణ్యంలో మాత్రం 270 వ‌ర‌కే ఆశ్ర‌యం క‌ల్పించ‌గ‌ల‌మ‌ని అక్క‌డి అధికారులు అంటున్నారు.

దీంతో మిగ‌తా సింహాలు ఇలా ఊళ్ల‌పైకి వెళ్ల‌కుండా వాటిని ఇత‌ర రాష్ట్రాల‌కు త‌ర‌లించాల‌ని ఈమ‌ధ్యే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీచేసింది.

మూడు సింహాలకు జీవిత ఖైదు

ముగ్గురి హత్య కేసులో దోషులుగా తేలడంతో మూడు సింహాలకు జూలో జీవిత ఖైదు విధించారు.

English summary
At least 18 Asiatic male lions have been taken into custody in connection with murder of three persons in Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X