బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో మిడ్ డే మీల్స్ లో కుక్క, పిల్లి మాంసం, వింత కాదు నిజం, ప్రతి రోజూ ఉండాలి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సామాన్యంగా చాల మంది ప్రతిరోజూ కోడి, మేక, గొర్రె మాంసం, చేపలు, రోయ్యలు, కోడిగుడ్లు తింటుంటారు. వీలైతే మాంసాహార ప్రియులు పక్షుల మాంసం తింటుంటారు. అయితే ఐటీ బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో విచిత్రం జరుగుతోంది.

రోడ్డున పోతున్న జంతువులను చంపి తింటున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. బెంగళూరు నగరంలోని విజయనగరలో ప్రసిద్ది చెందిన ఆది చుంచునగిరి మఠం ఉంది. ఆది చుంచునగిరి మఠంకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, భక్తులు, వివిద పార్టీల రాజకీయ నాయకులు భేటీ అవుతుంటారు.

Bizarre news dag and cat their mid day meals in Bengaluru City

ఆది చుంచునగిరి మఠంకు ఎదురుగా ఉన్న సర్వీసు రోర్డులో తమిళనాడుకు చెందిన దాదాపు 15 మంది వచ్చి నివాసం ఉంటూ క్వారీలో కూలి పనులు చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన వీళ్లు వీది కుక్కలు, పిల్లులను చంపి వాటిని నిప్పుల్లో కాల్చి మాంసం ముక్కలుగా చేస్తున్నారు.

ప్రతి రోజూ మద్యాహ్నం భోజనంలో కుక్క, పిల్లి మాంసం తింటున్నారు. వీరు తీరు గమనించిన స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. వీది కుక్కలు, పిల్లులను చంపి తింటున్న వీరిని చూసి ఆసహ్యం పెంచుకుంటున్నారు. అయితే మాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అని వారు అంటున్నారని స్థానికులు చెబుతున్నారు. కుక్క, పిల్లి మాంసం తింటున్న వారిలో మహిళలు, పిల్లలు సైతం ఉన్నారు.

English summary
People who are residing in Bengaluru Vijayanagar are now center of attraction for bizarre reasons. They kill dog, cat and becoming their mid day meals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X