• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరో అల్లుడు రూప రాక్షసుడు .. అనుమానంతో అత్తను, తర్వాత మామను కూడా ...

|

భోపాల్ : ఇటీవల సూర్యాపేట జిల్లాలో ఓ అల్లుడు రూప రాక్షసుడి గురించి తెలుసుకొన్నాం. అత్తపై అతను చేసిన దురగతాన్ని విన్నాం. పోతే మధ్యప్రదేశ్‌లో కూడా మరో అల్లుడు రెచ్చిపోయాడు. అత్తను, అడ్డొచ్చిన మామపై కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. ధూద్ మానియా గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తన మేనమామ, మేనత్తపై అల్లుడు చేసిన అఘాయిత్యం తెలుసుకొని ముక్కున వేలేసుకుంటున్నారు.

అత్తపై ..

అత్తపై ..

అన్పూర్ జిల్లా ధూద్ మానియాలో షాంఖూ గోండ్ భార్య పిల్లలతో కలిసి ఉంటున్నారు. షాంఖూ కుమారుడు గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవలే వారి దూడ కూడా అస్వస్థతకు గురై చనిపోయింది. షాంఖూ కుటుంబం తలపెట్టిన ఏ పని ముందుకుసాగడం లేదు. అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయి. దీంతో తమ కుటుంబానికి ఎవరో చేతబడి చేశారని అనుమానించాడు. ఆ అనుమానమే పెనుభూతమై ... కటకటాల్లోకి నెట్టింది. చివరికి జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు.

ఘోర పడవ ప్రమాదం: 34 మంది మృతుల్లో భారతీయ జంట, రెండేళ్ల క్రితమే పెళ్లిఘోర పడవ ప్రమాదం: 34 మంది మృతుల్లో భారతీయ జంట, రెండేళ్ల క్రితమే పెళ్లి

చేతబడ అనుమానంతో ..

చేతబడ అనుమానంతో ..

తన మేనమామ భార్య బేషాని గోండ్ చేతబడి చేస్తుందని భావించాడు. అదే నిజమని అనుకొన్నాడు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూశాడు. బుధవారం రాత్రి బేషాని గోండ్ గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. అదనుచూసి షాంఖూ గోండ్ .. ఆమెను అనుసరించాడు. అటవీలోకి వెళ్లిన ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. ఒకవేళ ఆమె దెయ్యం అయితే ఎలా భావించాడు. తలను మొండెంతో వేరుచేశాడు. మొండెం నుంచి దూరంగా తలను తీసుకెళ్లి పూడ్చిపెట్టాడు. మెల్లగా ఊరిలోకి వద్దామనుకొన్నాడు. కానీ అతని ప్లాన్ బెడిసికొట్టింది. భార్యను వెతుకుతూ మామ వచ్చాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చెప్పాలో తెలియక అతనిపై కూడా దాడిచేశాడు.

తర్వాత మామను కూడా ..

తర్వాత మామను కూడా ..

అయితే తన భార్య బేషాని రాకపోవడంతో ఆమె కోసం అటవీలోని వచ్చాడు భగ్ వాందిన్ గోండ్ .. అప్పుడే అత్తను హతమార్చిన అల్లుడు షాంఖూ గోండ్ .. అనుమానంగా కనిపించాడు. ఏం జరిగిందని చూస్తే .. చేతులకు రక్తపు మరకలు ఉన్నాయి. ఇంతలో మామపై కూడా దాడి చేశాడు. అతని హతమార్చాడు. షాంఖూ కత్తి, రక్తపు బట్టలతో పరుగెడుతుంటే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన గ్రామంలో సంచలనం కలిగింది. సొంత అత్త, మామను చంపడం ఏంటి అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు మేనమామ తరఫు బంధువులు గోండుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Shanghu Gond with his family Dood Mania, Anpur district. Shanghu's son has been ill for the past few days. Recently, their calf became ill and died. The work of the Shanghai family is not moving forward. Obstacles are coming at every step. He suspected that someone in his family had been blacklisted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X