వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాలో తేలిన పోత్తు : బీజేపీ 144 ,శివసేన 126 స్థానాల్లో పోటీ

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల మధ్య సీట్ల షేరింగ్ ఖారరైనట్టు తెలుస్తోంది.మహాలోని మొత్తం 288 స్థానాలకు గాను బీజేపీ 144 స్థానాల్లో ,శివసేన 126 స్థానాల్లో పోటీ చేసేందుకు రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది.. కాగా మరో 18 స్థానాలను ఇతర చిన్న పార్టీలకు కేటాయించనున్నారు.కాగా శివసేనకు డిప్యూటి సీఎం పదవి ఇచ్చే విధంగా ఒప్పందాలు జరిగినట్టు సమాచారం.

అక్టోబర్‌ 21న జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, మరియు శివసేనతో పాటు ఇతర పార్టీల మధ్య పోత్తు కుదిరిని విషయం తెలిసిందే..అయితే గత ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేసిన బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఈసారి మాత్రం తిరిగి పోత్తులు కుదుర్చుకున్నాయి. దీంతో సీట్ల షేరింగ్‌లో రెండు పార్టీల మధ్య సందిగ్ధత నెలకొంది. చేరో సగం సీట్లలో పోటి చేయాలని ముందుగా భావించారు. అయినప్పటికి ప్రస్తుత ఒప్పందం ప్రకారం మేజర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులే రంగంలోకి దిగనున్నారు.

BJP 144 ,shivsena 126 will contest in maharashtra elections

కాగా శివసేన, బీజేపీలు 2014కు ముందు ఇరవై సంవత్సరాల పాటు కలిసి పోటిచేశాయి. కాని 2014 ఎన్నికల్లో మాత్రం ఇరు పార్టీల పొత్తుకు బ్రేక్ పడింది. దీంతో విడిగా పోటీ చేయడంతో బీజేపీ మెజారటీ స్థానాలను దక్కించుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. మరోవైపు మహారాష్ట్రలో బలంగా ఉన్న శరద్ పవర్ మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే...కాగా మహారాష్ట్ర ఎన్నికల్లోని నాంధేడ్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కూడ పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్న విషయం తెలిసిందే...

English summary
BJP will contest 144 of the state's 288 seats. The Sena will contest 126 seats and 18 seats have been allotted to the smaller allies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X