• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: మోదీ వేరియంట్ కరోనా -ప్రధాని పరువుతీస్తూ కాంగ్రెస్ టూల్‌కిట్ -బీజేపీ సంచలన ఆరోపణలు

|

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవానికి తోడు వైరస్ చుట్టూ నెలకొన్న రాజకీయాలూ తారాస్థాయికి చేరాయి. రోజువారీ కొత్త కేసులు, భారీ సంఖ్యలో మరణాలు, ఆక్సిజన్ దొరక్క చావులు, నదుల్లో పెద్ద సంఖ్యలో కొట్టుకొస్తున్న శవాలు, టీకాల కొరత కారణంగా దాదాపు నిలిచిపోయిన వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఇలా ఎటు చూసినా కరోనా విలయపరిస్థితులు భయానకంగా మారిన తరుణాన పాజిటివిటీ ద్వారా ప్రజల్లో మార్పు తేవాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించుకోవడం తెలిసిందే. అయితే సదరు పాజిటివ్ వాతావరణాన్ని పాడుచేసేలా విపక్ష కాంగ్రెస్ భారీ ఎత్తున కుట్రలు పన్నిందని బీజేపీ ఆరోపిస్తున్నది..

రఘురామ వివాదంలో ట్విస్ట్: కేసీఆర్ ప్రస్తావన -జగన్‌పై భారీ కుట్రలు -సీల్డ్ కవర్‌లో సంచలన దృశ్యాలురఘురామ వివాదంలో ట్విస్ట్: కేసీఆర్ ప్రస్తావన -జగన్‌పై భారీ కుట్రలు -సీల్డ్ కవర్‌లో సంచలన దృశ్యాలు

కొవిడ్ పరిస్థితులను అవకాశంగా తీసుకుని కేంద్ర సర్కారుపై, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిందని, ప్రభుత్వ, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని, దేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ గౌరవాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ధ్వంసరచనకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. ఆ మేరకు కొవిడ్-19 సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ ఓ 'టూల్‌కిట్' రూపొందించిందని బీజేపీ బయటపెట్టింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర మంగళవారం మీడియాకు పలు కీలక అంశాలు చెప్పారు..

BJP alleges Congress using ‘toolkit’ to dent image of India, Modi amid covid crisis

దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతోందన్న సంబిత్ పాత్ర.. కొవిడ్-19 మ్యూటెంట్‌ను ''ఇండియన్ స్ట్రెయిన్'', ''మోదీ స్ట్రెయిన్'' అని పిలవాలంటూ తన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ''టూల్‌కిట్'' ద్వారా సూచనలు ఇస్తోందని పాత్రా ఆరోపించారు.

మళ్లీ బహిష్కరణ బాటలో చంద్రబాబు -అసెంబ్లీ బడ్జెట్ భేటీకి టీడీపీ దూరం -జగన్ సర్కారు కూలుతుందనే..మళ్లీ బహిష్కరణ బాటలో చంద్రబాబు -అసెంబ్లీ బడ్జెట్ భేటీకి టీడీపీ దూరం -జగన్ సర్కారు కూలుతుందనే..

కాంగ్రెస్ రూపొందించిన 'టూల్‌కిట్'లో ప్రధాని మోదీ ప్రతిష్టను ఎలా దెబ్బతీయాలో స్పష్టంగా రాసుందని, మోదీ పాపులారిటీని నాశనం చేయడానికే కాంగ్రెస్ కుయుక్తులు పన్నిందని, కొవిడ్ సంక్షోభాన్ని మోదీ సమర్థవంతంగా నిర్వహించారన్న కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు గంతు మార్చి సెకండ్ వేవ్‌ను అవకాశంగా తీసుకుని మోదీ పేరు చెడగొట్టాని చూస్తోందని సంబిత్ పాత్ర ఆరోపించారు.

BJP alleges Congress using ‘toolkit’ to dent image of India, Modi amid covid crisis

ఇండియాలోని విదేశీ కరెస్పాండెంట్లను ఉపయోగించుకుని అంతర్జాతీయ మీడియాలో మోదీ, ఆయన అసమర్థత అంటూ ప్రత్యేక కథనాలు వండివార్చాలని ఆ టూల్‌కిట్‌లో కాంగ్రెస్ పార్టీ తన శ్రేణులకు సూచించిందని. విదేశీ మీడియాలో వచ్చిన కరోనా మరణాలు, అంత్యక్రియల ఫోటోలను స్థానిక మీడియాలో ఉపయోగించాలని, వివిధ జిల్లాలకు చెందిన రిపోర్టకు చేరవేయాలని ఆ పార్టీ సూచిస్తోందని పాత్రా వివరించారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్వరంతో ఖండించింది. బీజేపీపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకూ కాంగ్రెస్ సిద్ధమైంది..

English summary
The BJP on Tuesday hit out at the Congress over an alleged “toolkit” of the opposition party, saying it wants to tarnish the image of the country and Prime Minister Narendra Modi by calling the new coronavirus strain as “Indian strain” or “Modi strain”. In a tweet, BJP spokesperson Sambit Patra also said that Congress extending help to the needy is “more of a public relations exercise with the help of friendly journalists and influencers than a soulful endeavour”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X