వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి మిత్రపక్షం షాక్: మోడీ సర్కార్ చర్యలకు నిరసన: ఆ బిల్లులకు వ్యతిరేకంగా ఎందాకైనా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీకి ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ.. కొన్ని బిల్లులను ఆమోదింపజేసుకోవబంలో చుక్కెదురవుతోంది. బీజేపీ మిత్రపక్షాలు ఆయా బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్నాయి. వాటివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని స్పష్టం చేస్తున్నాయి. దీనికోసం ఎందాకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిణామాలు కాస్తా బీజేపీకి మింగుడు పడట్లేదు.

మీడియాపై రకుల్ ప్రీత్ గుస్సా: దర్యాప్తు ఆపాలంటూ: న్యూస్ ఛానళ్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలుమీడియాపై రకుల్ ప్రీత్ గుస్సా: దర్యాప్తు ఆపాలంటూ: న్యూస్ ఛానళ్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

వ్యవసాయ బిల్లులపై రగులుతోన్న ఆ రెండు రాష్ట్రాలు

వ్యవసాయ బిల్లులపై రగులుతోన్న ఆ రెండు రాష్ట్రాలు

కేంద్రప్రభుత్వం కొత్తగా లోక్‌సభలో మూడు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిపై హర్యానా, పంజాబ్‌ రైతులు భగ్గుమంటున్నారు. తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలనూ చేపడుతున్నారు. ఆ బిల్లులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్‌సభలో ప్రవేశపెట్టకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు. హర్యానా గానీ, పంజాబ్ గానీ.. వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలే కావడం, లక్షల సంఖ్యలో రైతులు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 పంజాబ్‌లో మిత్రపక్షం

పంజాబ్‌లో మిత్రపక్షం

పంజాబ్‌లో బీజేపీకి మిత్రపక్షంగా ఉంటో వస్తోన్న శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నాయకులు ఈ మూడు వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆ బిల్లులను తాము వ్యతిరేకించి తీరుతామని శిరోమణి సభ్యుడు బల్విందర్ భుందర్ తెలిపారు. ఆ బిల్లులు ఎవరి ప్రయోజనాలనూ కాపాడలేవని అన్నారు. బీజేపీతో జట్టు కట్టినప్పటికీ.. సభలో తాము స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామని, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసమో తాము అండగా ఉండలేమిన అన్నారు.

 సొంత అజెండాతో బీజేపీ..

సొంత అజెండాతో బీజేపీ..

బీజేపీకి సొంత అజెండాతో పనిచేస్తోందని బల్విందర్ ఆరోపించారు. వారి అజెండా వారికి ఉంటే.. తమ అజెండా తమకు ఉందని స్పష్టం చేశారు. మిత్రపక్షంగా ఉన్నంత మాత్రాన బీజేపీ ఏం చెబితే.. దానికి తల ఊపలేమని కుండబద్దలు కొట్టారు. మిత్రపక్షాలను కలుపుకొని వెళ్లే మనస్తత్వాన్ని బీజేపీ నేతలు ఇప్పటికీ అలవరచుకోలేదని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను బీజేపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ మీద ఉన్న ఆగ్రహానికి మిత్రపక్షంగా ఉన్న తాము గురికాలేమని తేల్చి చెప్పారు.

 వ్యతిరేకించిన పంజాబ్ సర్కార్..

వ్యతిరేకించిన పంజాబ్ సర్కార్..

కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ ఉభయసభలో ప్రవేశపెట్టదలిచిన వ్యవసాయ బిల్లులను ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. దాన్ని అమలు చేయలేమని తెగేసి చెప్పింది. పంజాబ్‌లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. రైతుల ప్రయోజనాలను కాపాడలేని బిల్లుల వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం గానీ, ప్రయోజనం గానీ ఉండబోదని చెప్పారు. తాము రైతుల పక్షంగా ఉంటామని, పార్లమెంట్‌లో బిల్లులకు వ్యతిరేంగా పోరాడుతామనీ అన్నారు.

Recommended Video

Happy Birthday PM Modi : PM Narendra Modi's 70th birthday | Oneindia Telugu
హర్యానా పరిస్థితేంటీ?

హర్యానా పరిస్థితేంటీ?

హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోన్నప్పటికీ.. అది సంకీర్ణమే. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన్ నాయక్ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దుష్యంత్ చౌతాలా ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ బిల్లుల సెగ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికీ తాకే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. హర్యానాలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలను చేపట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో జన్ నాయక్ జనతా పార్టీ ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జేజేపీ బయటికి రావడమంటూ జరిగితే.. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగించలేదు.

English summary
Shiromani Akali Dal (SAD) leader Balwinder Bhunder says, "We will protest against agriculture bills in both the houses of Parliament. We are an independent party, the alliance does not mean that we have to agree with whatever they (BJP) say. They have their own agenda, we have ours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X