వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీపై బీజేపీ సంచలన ఫిర్యాదు -ఎన్నికల ప్రచారాన్ని నిరోధించాలంటూ ఈసీకి వినతి

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ చేస్తోన్న విస్తృత ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోన్న తరుణంలో బీజేపీ సంచలన ఫిర్యాదు చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనకుండా నిరోధించాలని ఎన్నికల కమిషన్‌(ఈసీ)ని బీజేపీ కోరింది.

viral photo: ఆకాశంలో తేలుతోన్న ఓడ -గ్రాఫిక్ కాదు, అచ్చ తెలుగులో దృష్టి భ్రాంతిviral photo: ఆకాశంలో తేలుతోన్న ఓడ -గ్రాఫిక్ కాదు, అచ్చ తెలుగులో దృష్టి భ్రాంతి

తమిళనాడు పర్యటలో రాహుల్.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని, మరొక స్వాతంత్ర్య పోరాటం చేయాలంటూ యువతను రెచ్చగొడుతున్నారని, ఇందుకుగానూ ఆయనపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని ఈసీని బీజేపీ కోరింది. ఈ మేరకు.. తమిళనాడు బీజేపీ ఎలక్షన్ కమిటీ ఇన్‌ఛార్జి వీ బాలచంద్రన్ గురువారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) సత్యబ్రత సాహూకు ఓ వినతిపత్రం సమర్పించారు.

 BJP asks EC to stop congress leader Rahul Gandhi from campaigning in Tamil Nadu

మార్చి 1న కన్యాకుమారి జిల్లా, ములగుమూడులోని ఓ పాఠశాలలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ముమ్మాటికీ ఎన్నికల ప్రచారమే అని, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ప్రచారం నిర్వహించడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం చేయకుండా నిరోధించాలని బీజేపీ కోరింది.

జగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులుజగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులు

నాటి కార్యక్రమంలో రాహుల్ గాంధీ.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశానికి ఇప్పుడు మరొక స్వాతంత్ర్య సంగ్రామం అవసరమని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఐపీసీ సెక్షన్ 109 (పురిగొలిపినందుకు శిక్ష), సెక్షన్ 124ఏ (దేశద్రోహం) ప్రకారం నేరమని, దేశంలో ప్రస్తుత పరిస్థితులను బ్రిటిష్ పరిపాలనా కాలంతో పోల్చారని, మరొక స్వాతంత్ర్య పోరాటానికి యువతను రెచ్చగొట్టారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది.

విద్వేషాన్ని పెంచడంతోపాటు, ప్రభుత్వంపై అసమ్మతిని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిఉంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా, అన్నాడీఎంకే, బీజేపీలు ఒకటిగా బరిలో నిలిచాయి.

English summary
The Tamil Nadu unit of the Bharatiya Janata Party on Thursday urged the Election Commission to restrain Congress leader Rahul Gandhi from campaigning in Tamil Nadu for the April 6 Assembly election, for allegedly violating the model code of conduct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X