వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యతిరేకత ఉన్నా వసుంధర, శివరాజ్ నాయకత్వంలోనే ఎన్నికలు: రమణ‌సింగ్‌పై సానుకూలత

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికలకు ముందు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో వరుసగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం ఖాయం. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల్లో నాయకత్వాన్ని మార్చకూడదని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది.

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి వసుంధర రాజే, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ల నాయకత్వంలోనే ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా వారే ముఖ్యమంత్రి అభ్యర్థులు కానున్నారు. వారిరువురిపై వ్యతిరేకత ఉన్నట్టు పార్టీ గుర్తించింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి వారిద్దరినీ మార్చాలని ఆయా రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు ఒత్తిడి తెచ్చారు.

BJP to back its chief ministers in poll-bound Madhya Pradesh, Chhattisgarh, Rajasthan

కనీసం వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకుండా ఉండాలని కోరారు. అయినప్పటికీ మార్పులు చేయకూడదని నిర్ణయించింది. మరో వైపు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌పై ఎలాంటి వ్యతిరేకతా లేకపోవడంతో ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లనుంది. ఈ మూడు రాష్ట్రాలకు ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరిగే అవకాశముంది.

English summary
The Bharatiya Janata Party (BJP) has decided to repose faith in its chief ministers in three election-bound states and will face the December poll under their leadership, two senior leaders of the party said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X