వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షాకు నోటీస్ ఇవ్వగలరా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయగలరా: ఈసిపై కాంగ్రెసు భగ్గు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ కన్నా ముందే బిజెప ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను లీక్ చేయడంపై కాంగ్రెసు పార్టీ భగ్గుమంది. ఈసి కన్నా ముందే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలంటూ మాల్వియా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

బిజెపి సూపర్ ఎలక్షన్ కమిషన్ అయిపోయిందని కాంగ్రెసు అధికార ప్రతినిధి రణదీప్ సిగ్ సుర్జేవాలా మండిపడ్డారు. ఈసి కన్నా ముందే కర్ణాటక ఎన్నికల తేదీలను వెల్లడిస్తుందని, ఆ రకంగా బిజెపి సూపర్ ఎలక్షన్ కమిషన్ అయిపోయిందని ఆయన ట్వీట్ చేశారు.

ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఈసి నోటీసు ఇవ్వగలదా, బిజెపి ఐటి సెల్ చీఫ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయగలదా అని ఆయన ఈసిని ప్రశ్నించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసి ప్రకటించడానికి కాస్తా ముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 12వ తేదీన జరుగుతాయని, ఓట్ల లెక్కింపు మే 18వ తేదీన జరుగతుందని మాల్వియా ట్వీట్ చేశారు.

English summary
BJP IT cell chief Amit Malviya on Tuesday sparked a controversy by tweeting the dates for the Karnataka Assembly Elections even before the Election Commission.Congress spokesperson Randeep Singh Surjewala said that the BJP has become the 'Super Election Commission'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X