• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దీదీ కోటలో వికసించిన కమలం..! బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మోదీ..!!

|

కోల్‌కతా/హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లో కమలం వికసించింది. దీదీ కోటలో మోదీ మంచి ఫలితాలను రాబడుతున్నారు. హోరాహోరీ పోరు తలపించిన బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తిరుగులేని ఆధిపత్యానికి కాషాయం పార్టీ ఈసారి గట్టి సవాల్‌ విసిరింది. రాష్ట్రంలో మొత్తం 42 స్థానాల ఉండగా.. అధికార టీఎంసీ కేవలం 23 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. గతంలో పెద్దగా ప్రభావం చూపని బీజేపీ ఈసారి ఏకంగా 17 ఎంపీ స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది.

బెంగాల్ లో సత్తా చాటిన మోదీ..! దీదీ కి గట్టి పోటీ ఇచ్చిన కమలం..!!

బెంగాల్ లో సత్తా చాటిన మోదీ..! దీదీ కి గట్టి పోటీ ఇచ్చిన కమలం..!!

ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచోకోటగా ఉన్న బెంగాల్‌లో 2012 ఎన్నికల్లో వామపక్షాలను చిత్తుచేసి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వామపక్షాలను కోలుకోకుండా చేసి.. వరుస విజయాలతో బెంగాల్‌పై దీదీ ఆధిపత్యం చలాయిస్తున్నారు. 2012 ఎన్నికల నుంచి దీదీ అధికారంలోకి రావడంతో బీజేపీ కొంత కొంతగా ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఛిన్నాభిన్నమైన వామపక్షాల ఓటుబ్యాంకు కొంత బీజేపీకి కలిసిరావడం.. మొదట్లో దీదీ కూడా బీజేపీ పట్ల అంత కఠినమైన వైఖరి ప్రదర్శించకపోవడంతో ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎదిగేందుకు కమలం పార్టీ అధినాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

 తృణమూల్‌కు సవాల్‌ విసిరిన మోదీ..! సవాల్ ను నిలబెట్టుకున్న మోదీ..!!

తృణమూల్‌కు సవాల్‌ విసిరిన మోదీ..! సవాల్ ను నిలబెట్టుకున్న మోదీ..!!

ఈ క్రమంలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బెంగాల్‌లో కేవలం రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈ రెండు స్థానాలను ఆలంబనగా చేసుకుంటూ.. దీదీకి ప్రతిపక్షంగా ఎదుగుతూ.. క్రమంగా తృణమూల్‌కు సవాల్‌ చేసే స్థాయికి బీజేపీ ఎదిగింది. ఈసారి ఎన్నికలు దీదీ-మోదీ మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా సాగాయి. దీదీపై మోదీ, అమిత్‌ షా తీవ్రంగా విరుచుకుపడగా.. మమతా బెనర్జీ కాషాయ నేతలకు దీటుగా బదులిచ్చారు.

 బెంగాల్ లో హోరీ హోరీ..! నువ్వా నేనా అనుకున్న బీజేపి, తృణమూల్‌..!!

బెంగాల్ లో హోరీ హోరీ..! నువ్వా నేనా అనుకున్న బీజేపి, తృణమూల్‌..!!

ఇందుకు తోడు క్షేత్రస్థాయిలో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల ఘర్షణతో ఈసారి ఎన్నికల్లో తీవ్ర హింస చెలరేగింది. ఈ క్రమంలోనే బెంగాల్‌లో వికసించాలన్న కమలం వ్యూహ ఫలించినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు లెఫ్ట్‌కు జైకొట్టిన బెంగాల్‌ ఇప్పుడు క్రమంగా రైట్‌ వైపు (హిందుత్వ వైపు) మొగ్గుతున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 గట్టి పోటీ ఇచ్చిన బీజేపి..! ఖంగుతిన్న దీదీ..!!

గట్టి పోటీ ఇచ్చిన బీజేపి..! ఖంగుతిన్న దీదీ..!!

తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఎన్నికల ఫలితాల ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. జనం మరోసారి నరేంద్రమోదీకి పట్టం కట్టినట్టు కౌంటింగ్‌ ఎర్లీ ట్రెండ్స్‌ స్పష్టం చేస్తున్నాయి. తిరుగులేని మెజారిటీతో సొంతంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశముందని ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్‌ ఫలితాల సరళి చాటుతోంది. దేశవ్యాప్తంగా మరోసారి నమో మంత్రం పనిచేసినట్టు కనిపిస్తుండగా.. ఈసారి ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ప్రచారం, ప్రభావం, ఆయన సోదరి ప్రియాంక గాంధీ ప్రచారమూ పెద్దగా పనిచేయనట్టు స్పష్టమవుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Lotus blossomed in West Bengal. Modi is getting good results in Didi Fort. In the Bengal war, Trinamool Congress chief and Chief Minister Mamata Banerjee had a strong challenge to the crucial leadership of the party. The total number of seats in the state is 42. The official TCM is leading only 23 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more