వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీకే వల్ల భారీ డ్యామేజ్: సొంత రాష్ట్రంలో పాత్రపై బీజేపీ విమర్శలు - దిమ్మతిరిగేలా ఎదురుదాడి

|
Google Oneindia TeluguNews

ఆయనతో జత కట్టని పార్టీలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు.. తను అడుగు పెట్టని రాష్ట్రాల సంఖ్యా తక్కువే.. నాడు మోదీ ప్రధాని కావడం దగ్గర్నుంచి వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీల విజయంలో ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ పాత్ర మనందరికీ తెలిసిందే. వినూత్న వ్యూహాలతో దేశవ్యాప్తంగా పేరు పొందిన ఆయన.. సొంత రాష్ట్రంలో జరుగుతోన్న ఎన్నికల్లో మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. తొమ్మిది నెలలుగా కనీసం బీహార్ లోకి అడుగైనా పెట్టలేదు. అయినాసరే.. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో పీకే పేరు హైలైట్ గా వినిపిస్తోంది..

ఆ విషయంపై గట్టిగా ప్రచారం చేయండి - మెసేజ్ క్లియర్‌గా వెళ్లాలి - సీఎం జగన్ కీలక ఆదేశాలు ఆ విషయంపై గట్టిగా ప్రచారం చేయండి - మెసేజ్ క్లియర్‌గా వెళ్లాలి - సీఎం జగన్ కీలక ఆదేశాలు

అనూహ్య సమీకరణాలు..

అనూహ్య సమీకరణాలు..


243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశ పోలింగ్ ఈనెల 28న, మలి దశ నవంబర్ 3న, తుది దశ నవంబర్ 7న పూర్తికానుంది. గతంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూటముల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోగా, ఈసారి ముందుగానే సమీకరణాలు తారుమారుకావడం గమనార్హం. ఎన్డీఏ కూటమిలో ఉంటూనే లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) బీహార్ లో ఒంటరిగా బరిలోకి దిగుతుండటం, ‘‘మోదీపై గౌరవం- నితీశ్ పై పోరాటం'' నినాదంలో భాగంగా జేడీయూ అభ్యర్థులపై మాత్రమే ఎల్జేపీ పోటీ చేస్తుండటం, జేడీయూతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, బీజేపీ నేతలు చాలా మంది చిరాగ్ తో జత కడుతుండటం, దీంతో బీజేపీ ఓటర్లు అయోమయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడటం లాంటి అనూహ్య పరిణామాలుగా మారాయి. దీనిపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది..

జస్టిస్ రమణ పిల్లలపై ఫాల్తూ కేసు - జగన్‌కు 60 నెలల జైలు - ఏపీలో ఆర్టికల్ 356: ఎంపీ రఘురామజస్టిస్ రమణ పిల్లలపై ఫాల్తూ కేసు - జగన్‌కు 60 నెలల జైలు - ఏపీలో ఆర్టికల్ 356: ఎంపీ రఘురామ

చిరాగ్ వెనుక పీకే..

చిరాగ్ వెనుక పీకే..

బీహార్ లో ఎన్డీఏ కూటమిని దెబ్బతీసేలా ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఒంటరి పోరుకు సిద్ధం కావడం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రమేయం ఉందని, పీకే వల్ల కూటమికి భారీ డ్యామేజ్ కలగొచ్చని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ లాంటివాళ్లు సైతం.. చిరాగ్ వెనుక పీకే ఉన్నాడని ఆరోపిస్తున్నారు. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణాన్ని ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు చిరాగ్ ఎల్జేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేయడం, శోకంలో ఉన్న తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు చిరాగ్.. ఒక్క మోదీకి మాత్రమే థ్యాంక్స్ చెప్పి, నితీశ్ ను విస్మరించడం లాంటివి పీకే ఐడియాలే అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కాగా,

బీహార్ వెళ్లి 9 నెలలైంది..

బీహార్ వెళ్లి 9 నెలలైంది..


తనతో చిరాగ్ బంధంపై బీజేపీ చేస్తోన్న ప్రచారాన్ని ప్రశాంత్ కిషోర్ ఖండించారు. ఎల్జేపీ క్యాండిడేట్లను ప్రకటించినప్పటి నుంచి తన పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంపై ఆయన మీడియాకు విరణ ఇచ్చారు. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రమేయం, పాత్ర కొంచెం కూడా లేదని, ఫిబవ్రవరిలో ఢిల్లీకి వచ్చాక మళ్లీ సొంత రాష్ట్రానికి వెళ్లలేదన్నారు. చివరిసారిగా చిరాగ్ పాశ్వాన్ తో భేటీ అయింది కూడా నితీశ్ కుమార్ సమక్షంలోనే అని, ఎల్జేపీ ఒంటరిపోరుతో తనకెలాంటి సంబంధం లేదన్న పీకే.. ఇలా ఎందుకు జరుగుతుందో మాత్రం చెప్పగలనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు..

నితీశ్‌ను ఫూల్ చేయడానికే..

నితీశ్‌ను ఫూల్ చేయడానికే..


‘‘ఎన్డీఏలో ఉంటూనే చిరాగ్ పాశ్వాన్ సొంతగా అభ్యర్థుల్ని ప్రకటించడానికి ముందు పలు దఫాలుగా అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయిన మాట వాస్తవం కాదా? బీజేపీ పెద్దల అంగీకారం తర్వాతే ఎల్జేపీ పోటీకి సిద్ధమైంది నిజం కాదా? బీజేపీ క్యాండిడేట్లను వదిలేసి.. కేవలం జేడీయూ పోటీ చేస్తోన్న సీట్లలో మాత్రమే అభ్యర్థుల్ని దించడమంటే అర్థమేంటి? బీజేపీ-ఎల్జేపీ కలిసి నితీశ్ ను ఫూల్ చేయడానికి కాదా? అంతెందుకు? తమ అధినేతలు చిరాగ్ తో టచ్ లో లేరని బీజేపీ నేతలు చెప్పగలరా? పోనీ, చిరాగ్ కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఒక్క మాటైనా, కనీసం ప్రకటనైనా చేయగలరా?'' అని పదునైన ప్రశ్నలతో పీకే బీజేపీపై ఎదురుదాడికి దిగారు. ఎన్నో రాష్ట్రాల్లో పలు పార్టీలను విజయ తారాలకు చేర్చిన పీకే.. 2018లో జేడీయూలో చేరి, ఏడాది తిరక్కుండానే బయటికి వచ్చేయడం తెలిసిందే. మొత్తంగా తన ప్రమేయం (అధికారికంగా) లేకున్నా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ హాట్ టాపిక్ గా కొనసాగుతున్నారు.

English summary
Bihar BJP leaders, facing relentless criticism from their ally for not taking on Chirag Paswan publicly, are pitching the idea that Prashant Kishor is actively counselling him. "First, I have nothing to do with the politics of Bihar in the current assembly elections. Second, my last meeting with Chirag was at Nitish Kumar's home in his presence," said the election strategist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X