• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Khusbu: అందరూ గెలవాలి, కుష్బు లైట్లు ఆరిపోతాయా ?, అక్క వేదాంతం, తమ్ముళ్ల రాద్దాంతం, వైరల్ !

|

చెన్నై/మదురై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతున్నాయి. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. బహుబాష నటి, తమిళ సినీరంగంలో లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగి ప్రజల దగ్గర మొదటిసారి గుడి కట్టించుకున్న దేవత (నటి) కుష్బు చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు, అన్ని పార్టీల నాయకులు గెలవాలి, అందరూ బాగుండాలి, మనం చేసే ప్రయత్నాలు మనం చేశాము ఇక ఓటరు దేవుళ్లే ఏమి తీర్పు ఇస్తారో ? అంటూ కుష్బూ వేదాంతం చెబుతూ చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. థౌజండ్ లైట్స్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన నటి కుష్బు లైట్లు ఆరిపోయే పరిస్థితి ఎదురు అవుతున్న టైమ్ లో ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కా నీ లెక్కలు భలే లెక్కలు అక్కా, ఇక ఏ పార్టీలో చేరుతారు ? అంటూ నెటిజన్లు (తమ్ముళ్లు) సెటైర్లు వేస్తున్నారు.

Wife: పర్సనల్ లైఫ్ లో టార్చర్, భర్త, అత్త ఎంట్రీ, వీడియో తీసి భార్య ఆత్మహత్య, అదే మ్యాటర్ లో!Wife: పర్సనల్ లైఫ్ లో టార్చర్, భర్త, అత్త ఎంట్రీ, వీడియో తీసి భార్య ఆత్మహత్య, అదే మ్యాటర్ లో!

 ఓఊపు ఊపేసిన కుష్బు

ఓఊపు ఊపేసిన కుష్బు

1980 కాలంలో సినీరంగంలో ఎంట్రీ ఇచ్చిన కుష్బు తరువాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తదితర బాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ సినీ అభిమానుల్లో చెక్కు చెదరని గుర్తింపు తెచ్చుకున్న నటి కుష్బుకు తమిళనాడులో గుడి కట్టారంటే ఆమె ఏ రైంజ్ లో అభిమానులను సంపాధించుకున్నారో అర్థం అవుతోంది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు దీటుగా నటి కుష్బు అభిమానులను సంపాధించుకున్నారనే విషయం తెలిసిందే.

 జంప్ జిలానీలో కుష్బుకు పోటీనే లేదు

జంప్ జిలానీలో కుష్బుకు పోటీనే లేదు

సినీరంగంలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో నటి కుష్బు మొదటి సారి అన్నాడీఎంకే (అమ్మ జయలలితకు) మద్దతుగా ప్రాచారం చేశారు. జయలలిత వెంట నడిచిన కుష్బు తరువాత అమ్మకు రాంరాం చెప్పిసి వెంటనే డీఎంకే (కురుణానిధి) పార్టీలో చేరారు. డీఎంకే పార్టీలో చక్రం తిప్పడానికి ప్రయత్నించిన కుష్బు తరువాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ పార్టీకి మంగళం పాడేసిన కుష్బు బీజేపీలోకి జంప్ అయ్యారు.

థౌజండ్ లైట్స్ లో మెరిసిపోవాలని మెరుపు కలలు

థౌజండ్ లైట్స్ లో మెరిసిపోవాలని మెరుపు కలలు

ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ-అన్నాడీఎంకే పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే థౌజండ్ లైట్స్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన నటి కుష్బు లైట్లు ఆరిపోతాయని, ఆమె కచ్చితంగా ఓడిపోతారని ఇటీవల విడుదలైన సర్వే ఫలితాల్లో తెలిసింది.

రూట్ మార్చిన అక్క

రూట్ మార్చిన అక్క

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో నటి, బీజేపీ నాయకురాలు కుష్బు ఓ ట్వీట్ చెయ్యడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఈ రోజు మనకు ఎంతో ముఖ్యమైన రోజు, చరిత్ర తిరగరాసే రోజు అని అందరూ గుర్తు పెట్టుకోవాలి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పార్టీల నాయకులకు గుడ్ లక్, అందరూ గెలవాలి, అందరూ బాగుండాలి, మనం చేసే ప్రయత్నాలు మనం చేశాము, ఇక ఓటరు దేవుళ్లు ఏ తీర్పు ఇచ్చినా మనం కచ్చితంగా అంగీకరించాలని అంటూ ఓ ట్వీట్ చేసిన కుష్బు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.

ఓటమి అంగీకరించినట్లేనా ?

ఓటమి అంగీకరించినట్లేనా ?


తమిళనాడులోని థౌజండ్ లైట్స్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన నటి కుష్బు ఎన్నికల ఫలితాల్లో వెనుకపడిపోయారు. థౌజండ్ లైట్స్ నియోక వర్గంలో తాను కచ్చితంగా ఓడిపోతానని తెలుసుకున్న నటి కుష్బు ఇలాంటి ట్విట్ చేశారా ? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎవరు గెలిచినా మనం ఓటమిని కచ్చితంగా అంగీకరించాలని నటి కుస్బు పరోక్షంగా ఆమె ఓటమిని అంగీకరిస్తున్నారని కొందరు రాజకీయ నాయకులు, పలువురు నెటిజన్లు అంటున్నారు.

అక్కా మీకు గుడ్ లక్

అక్కా మీకు గుడ్ లక్


నటి కుష్బు చేసిన ట్వీట్ కు అనేక మంది రాజకీయ ప్రముఖులు స్పంధించారు. సోదరి మీరు కూడా కచ్చితంగా ఎమ్మెల్యేగా విజయం సాధించాలని మేము మనస్పూర్తిగా దేవుడిని కోరుకుంటున్నామని అన్ని పార్టీల నాయకులు ట్విట్ చేశారు. మీరు బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోతామని అనుకుంటున్నట్లు ఉంది అని మరికొందరు అంటున్నారు.

  AP Inter Exams 2021: Hall Tickets వచ్చేసాయ్, పరీక్షలు రద్దు చేయాలని KA Paul డిమాండ్| Oneindia Telugu
  మీ లెక్కలు సూపర్ మేడమ్

  మీ లెక్కలు సూపర్ మేడమ్


  మేడమ్.... మీరు గ్రేట్, ఇక ముందు మీరు ఏ పార్టీలో చేరాలని లెక్కలు వేసుకుంటున్నారు అక్కా ? అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కౌంటర్ గా ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం మీద తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో నటి కుష్బు చేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Khusbu Madam: BJP candidate Khusbu Sunder says that all the best to every candidates from every party in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X