బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు, బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక, కాంగ్రెస్ అడ్రస్ లేదు, దెబ్బకు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ నుంచి జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి కేసీ. రామమూర్తి విజయం సాధించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ తన అభ్యర్థిని ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవడంలో విజయం సాధించింది. రాజ్యసభ ఎన్నికలకు పత్రిపక్ష పార్టీలు కాంగ్రెస్, జేడీఎస్ లు దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేసీ. రామమూర్తి బీజేపీలో చేరి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా విజయం సాధించారు. గురువారం కర్ణాటక విధాన సభ కార్యదర్శి, రాజ్యసభ ఎన్నికల అధికారి బీజేపీ అభ్యర్థి కేసీ. రామమూర్తి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారని అధికారికంగా ప్రకటించారు.

ఐటీ దాడులు, కంప్యూటర్లో 150 బ్లూ ఫిల్మ్స్, కంపెనీ అకౌంటెంట్ ఆత్మహత్య, భార్యకు ఫోన్ చేసి!ఐటీ దాడులు, కంప్యూటర్లో 150 బ్లూ ఫిల్మ్స్, కంపెనీ అకౌంటెంట్ ఆత్మహత్య, భార్యకు ఫోన్ చేసి!

కేసీ రామమూర్తి హవా

కేసీ రామమూర్తి హవా

బెంగళూరులో నివాసం ఉంటున్న కేసీ. రామమూర్తి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కేసీ రామమూర్తి 2022 జూన్ వరకు కొనసాగడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేసీ రామమూర్తి ఆపార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చెయ్యడంతో మళ్లీ రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో మళ్లీ కేసీ. రామమూర్తి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.

 కాంగ్రెస్, జేడీఎస్ అడ్రస్ లేదు

కాంగ్రెస్, జేడీఎస్ అడ్రస్ లేదు

కర్ణాటక అసెంబ్లీ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, జేడీఎస్ లు దూరంగా ఉన్నాయి. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. పైగా కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు వేర్వేరుగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి తమ అభ్యర్థులను గెలిపించుకోవడం సాధ్యం కాదని తెలుసుకుని ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కనీసం నామినేషన్లు కూడా వెయ్యలేదు.

 కేసీ రామమూర్తి మాజీ ఐజీపీ

కేసీ రామమూర్తి మాజీ ఐజీపీ

కేసీ రామమూర్తి మాజీ ఐపీఎస్ అధికారి. కర్ణాటక పోలీసు శాఖలో ఐజీపీగా పని చేసిన కేసీ రామమూర్తి తన ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేసి 2016లో రాజకీయాల్లోకి వచ్చారు. 2016లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కేసీ రామమూర్తి తరువాత రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కేసీ రామమూర్తి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన క్రమంగా దూరం అవుతూ వచ్చారు.

 కాంగ్రెస్ కు గుడ్ బై

కాంగ్రెస్ కు గుడ్ బై

2019 అక్టోబర్ 16వ తేదీ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేసీ రామమూర్తి బీజేపీలో చేరారు. తరువాత కర్ణాటకలో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీ రామమూర్తి మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. సీఎంఆర్ విద్యాసంస్థల అధ్యక్షుడిగా కేసీ రామమూర్తి కొనసాగుతున్నారు.

English summary
Bengaluru: BJP candidate K.C.Ramamurthy elected anonymously from Karnataka assembly to Rajya Sabha. Congress and JD(S) candidate not filed nomination for the by elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X