వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

love jihad: కరోనా కాలంలో ఇదేం రామాయణం, మీరే ఏం చేస్తారో తెలీదు, ఆపండి, సీఎం !

|
Google Oneindia TeluguNews

లక్నో/ ఉత్దర్ ప్రదేశ్: ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం యువతి, యువకుడి ఇష్టానికి సంబంధించిన విషయం. ప్రేమ పెళ్లిళ్లలను అడ్డుకోవడానికి చాలా సందర్బాల్లో వారి కుటుంబ సభ్యులు అడ్డుపడుతుంటారు. అయితే లవ్ జీహాద్ పేరుతో కొన్ని సంఘ, సంస్థలు లేనిపోని రామాయణాలు చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇక ముందు మన రాష్ట్రంలో లవ్ జీహాద్ అనే పేరు వినపడకూడదు, ఆ పేరుతో కొన్ని సంఘ, సంస్థలు రెచ్చిపోకూడదు, మీరు ఏం చేస్తారో చెయ్యండి, మీకు నేనే పూర్తి పవర్స్ ఇస్తున్నాను, ఇంకోసారి లవ్ జీహాద్ పేరుతో గొడవలు, రామాయణాలు, పరస్పరం కేసులు పెట్లుకోవడం లాంటి సంఘటనలు జరగకుండా మీరే చూసుకోండి అంటూ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ ఆ రాష్ట్ర హోమ్ శాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Torture: సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తుంటే పోలీసు ఏం చేశాడంటే, మామూలోడుకాదు, ఆంటీలు రివర్స్!Torture: సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తుంటే పోలీసు ఏం చేశాడంటే, మామూలోడుకాదు, ఆంటీలు రివర్స్!

 లవ్ జీహాద్ ఓ ట్రెండ్ ?

లవ్ జీహాద్ ఓ ట్రెండ్ ?

ఉత్దర్ ప్రదేశ్ తో పాటు ఉత్దర భారతదేశంలో, కర్ణాటకలో అక్కడక్కడ లవ్ జీహాద్ పేరుతో అమాయకులైన హిందూ అమ్మాయిలను మోసం చేసి బలవంతంగా మతం మార్చి ముస్లీం యువకులు పెళ్లి చేసుకుంటున్నారని, అలాగే బలవంతంగా హిందూ యువకులు ముస్లీం యువతులను పెళ్లి చేసుకుంటున్నారని కొన్ని సంఘ సంస్థలు ఆరోపిస్తున్నాయి. లవ్ జీహాద్ ను అడ్దుకోవడానికి కొన్ని సంఘ, సంస్థలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయని ఓ వర్గం ఆరోపిస్తోంది.

 మీరట్ లో చాలా మీరిపోయింది

మీరట్ లో చాలా మీరిపోయింది

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్, కాన్పూర్, లఖింపూర్ ప్రాంతాల్లో ఇటీవల యువతులకు బలవంతంగా మతం మార్చి మరో మతం యువకులకు పెళ్లి చేశారని, అలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయని ఆరోపణలు రావడంతో కేసులు నమోదైనాయి. లవ్ జీహాద్ కు సంబంధించి కొన్ని సాక్షాలు మా దగ్గర ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.

 కొత్త చట్టాలు అవసరమా ?

కొత్త చట్టాలు అవసరమా ?

లవ్ జీహాద్ కేసులు మన రాష్ట్రంలో ఎక్కువ అవుతున్నాయని ,ఇలాంటి సంఘటన వలన సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని, వాటిని పూర్తిగా అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఉత్తర్ ప్రదేశ్ హోమ్ శాఖ ప్రధాన కార్యదర్శి అవనీష్ కుమార్ అవస్థీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు మృత్యంజయ్ కుమార్ మీడియాకు వివరించారు.

 కొత్త వ్యూహాలు సిద్దం చెయ్యండి

కొత్త వ్యూహాలు సిద్దం చెయ్యండి

లవ్ జీహాద్ ను అరికట్టడానానికి మనం ఒక వ్యూహాన్ని సిద్దం చెయ్యాలని, ఆ వ్యూహం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ హోమ్ శాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారని మృత్యంజయ్ కుమార్ మీడియాకు చెప్పారు. లవ్ జీహాద్ ఆగడాలకు చెక్ పెట్టడానికి పోలీసులు సిద్దం అవుతున్నారు.

Recommended Video

Love Jihad : Let There Be Love
 సోషల్ మీడియా రామాయణం

సోషల్ మీడియా రామాయణం

ఇటీవల లవ్ జీహాద్ సంఘటనల విషయంలో సోషల్ మీడియాలో లేనిపోని రాద్దాంతం ఎక్కువ అవుతోందని, పెరుగుతున్న టెక్నాలజీని వాడుకుని కొందరు సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా తాము అన్ని చర్యలు తీసుకుంటామని ఉత్తర్ ప్రదేశ్ హోమ్ శాఖ ప్రధాన కార్యదర్శి అవనీష్ కుమార్ అవస్థీ అన్నారు. మొత్తం మీద లవ్ జీహాద్ పేరుతో లేనిపోని రామయాణాలు చేస్తున్న వారికి ఇక ముందు కళ్లెం వెయ్యడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యింది.

English summary
Love jihad: Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Friday directed senior officials of the state Home Department to prepare a plan to stop incidents of “love jihad”, following several such cases reported from different parts of the state, according to senior officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X