వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ ఇన్ ఇండియా: రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Rahul Gandhi VS Smriti Irani : #WatchVideo రేప్ ఇన్ ఇండియా నా ? ప్రజలు కోపంగా లేరా?| Oneindia Telugu

న్యూఢిల్లీ: మేక్ ఇన్ ఇండియా కాదు.. రేప్ ఇన్ ఇండియాగా మారిపోయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీతోపాటు మహిళా ఎంపీలు ఈసీని కోరారు.

Citizenship Bill: రాహుల్ ట్వీట్‌తో శివసేన మళ్లీ యూటర్న్, ఉద్దవ్ థాక్రే ఏమన్నారంటే..?Citizenship Bill: రాహుల్ ట్వీట్‌తో శివసేన మళ్లీ యూటర్న్, ఉద్దవ్ థాక్రే ఏమన్నారంటే..?

రాహుల్ పై తగిన చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరినట్లు స్మృతీ ఇరానీ తెలిపారు. ఒక రాజకీయ నాయకుడు తొలిసారిగా అత్యాచార ఘటనలపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు. పురుషులందరూ రేపిస్టులని ఆయన అంటున్నారని, ప్రజలు ఆయనపై కోపంగా లేరా? అని ప్రశ్నించారు.

BJP complains to EC against Rahul Gandhi’s ‘rape in India’ remark

భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు జరగాలని రాహుల్ కోరుకుంటున్నారని అన్నారు. తాము మేకిన్ ఇండియా అంటుంటే.. ఆయన మాత్రం ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ఎటువంటి శిక్ష వేయాలో ప్రజలకే వదిలేస్తున్నామని స్మృతీ ఇరానీ అన్నారు.

జార్ఖండ్ ఎన్నికల్లో గెలిచేందుకు రాహుల్ గాంధీ అత్యాచార ఘటనలను ఉపయోగించుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. కాగా, అత్యాచార ఘటనలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో దుమారం రేపాయి. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటు ఉభయసభల్లో మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు.

English summary
BJP’s women Parliamentarians, led by Union Minister Smriti Irani, Friday met the Election Commission officials in New Delhi and sought “severest possible action” against Congress leader Rahul Gandhi over his “rape in India” remark he made at an election rally in Jharkhand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X