వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ ప్రకటనపై వివాదం : గుర్తును రద్దుచేయండి, ఫిర్యాదు చేసిన బిజెపి

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తును రద్దు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఆ పార్టీ మతపరమైన ప్రచారాన్ని చేపట్టిందని కాంగ్రెస్ పై బిజెపి ఆరోపణలు చేస్తోంది.ఈ ఆరోపణలను కాంగ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బిజెపి ఆరోపిస్తోంది.ఎన్నికల ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించినందుకుగాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తును రద్దు చేయాలని ఆ పార్టీ ఫిర్యాదు చేసింది.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. ఎన్నికల కమీషన్. ఎన్నికల నియామవళి ప్రస్తుతం అమల్లో ఉంది. దరమిలా ఈ రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు చేసే ప్రచారాలను ఎన్నికల కమీషన్ నిశితంగా పరిశీలిస్తోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృస్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ చేసిన ప్రచారం వివాదాస్పదంగా మారింది. ఈ ప్రచారంపై బిజెపి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు మతపరమైన అంశాలను రాహూల్ ప్రచారంలో ఉపయోగించుకొన్నారని బిజెపి ఆరోపిస్తోంది.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తును రద్దుచేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.

 రాహూల్ ప్రచారంపై బిజెపి అభ్యంతరాలు

రాహూల్ ప్రచారంపై బిజెపి అభ్యంతరాలు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాందీ చేసిన ప్రచారం బిజెపి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై ఆ పార్టీ ఎన్నికల గుర్తును రద్దుచేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడ బిజెపి ఫిర్యాదుచేసింది. ఈ నెల 11వ, తేదిన ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని బిజెపి తప్పుబడుతోంది. ప్రజలు ఆరాధించే శివుడు, గురునానక్, బుద్దుడు, మహవీర్ చిత్రపటాల్లో హస్తం చూపిస్తూ ఉంటారు. హస్తం చూపడం గురించి ఒకరిని అడిగాను, దాని అర్థం భయం లేదు. అభయహస్తమని చెప్పారని రాహూల్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల పట్ల బిజెపి అభ్యంతరం వ్యక్తం చేసింది.

 కాంగ్రెస్ పై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు

కాంగ్రెస్ పై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా తీసుకొంది. మత పరమైన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ చేశారని ఆ పార్టీ విమర్శలు గుప్పించింది.ఈ విషయమై చర్యలు తీసుకోవాలని బిజెపి పట్టుబడుతోంది. కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలను ప్రలోభపెట్టి ఓట్లు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బిజెపి ఆరోపిస్తోంది.ఈ విషయమై ఎన్నికల కమీషన్ కు బిజెపి ఫిర్యాదు చేసింది.

 ఎన్నకలపై రాహుల్ వ్యాఖ్యల ప్రభావం

ఎన్నకలపై రాహుల్ వ్యాఖ్యల ప్రభావం


ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల్లో రాహూల్ చేసిన వ్యాఖ్యలు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుందని బిజెపి అభిప్రాయంతో ఉంది. ఎన్నికల సమయంలో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉందని బిజెపి నాయకులు కాంగ్రెస్ కు సూచిస్తున్నారు.ఈ వ్యాఖ్యలు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉందని బిజెపి అభిప్రాయంతో ఉంది.

బిజెపి ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్

బిజెపి ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్

ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం పొందేందుకుగాను బిజెపి అనసర రాద్దాంతం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాహూల్ చేసిన వ్యాఖ్యలను బిజెపి తప్పుబట్టడాన్ని ఆ పార్టీ నాయకులు ఖండించారు. ఎన్నికల గుర్తుతో ఉన్న అనుబంధాన్ని ఆ పార్టీ నాయకులు మరో సారి గుర్తు చేశారు. ఈ విషయంలో తప్పేమి ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పునియా ప్రశ్నించారు.

English summary
bjp complient against congress party on contravorsy statement , bjp opposed congress party vice president rahul gandhi statement ,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X