వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ అసెంబ్లీని సమావేశపరచాలి, నో చెప్పడంలో బీజేపీ కుట్ర: రాహుల్ గాంధీ...

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్ అసెంబ్లీని గవర్నర్ ఎందుకు సమావేశ పరచడం లేదు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇందులో బీజేపీ కుట్ర ఉంది అని ఆయన ఆరోపించారు. అసెంబ్లీని సమావేశపరిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకుంటుంది అని రాహుల్ అన్నారు. అలా జరగడానికి వీలు లేదని బీజేపీ భావిస్తోందని రాహుల్ మండిపడ్డారు.

 BJP Conspiracy Clear, Governor Must Call Assembly Session: Rahul..

రాజ్యాంగం మేరకు పాలకులు నడుచుకోవాలని.. ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వాలు ఏర్పడతాయని రాహుల్ అన్నారు. కానీ బీజేపీ మాత్రం 8 కోట్ల రాజస్తానీయులను అవమానించిందని మడిపడ్డారు. గవర్నర్ అసెంబ్లీని సమావేశ పరిస్తే నిజం ఏంటో దేశానికి తెలుస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా మాత్రం తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.

Recommended Video

Audio Tapes కలకలం... Congress దూకుడు, రెబల్‌ ఎమ్మెల్యేల కు Show Cause Notices, BJP వ్యూహం ?

అంతకుముందు రాజ్ భవన్ వద్ద సీఎం అశోక్ గెహ్లట్ సహా ఎమ్మెల్యేలు.. సోమవారం అసెంబ్లీని సమావేశ పరచాలని నినాదాలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో సమావేశపరచడం కుదరదని అంతకుమందు కల్ రాజ్ మిశ్రా గెహ్లట్‌తో చెప్పడంతో సీఎం ఎమ్మెల్యేలతో కలిసి బల ప్రదర్శన చేశారు. సచిన్ పైలట్, అతనికి మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

English summary
Rajasthan Governor must call an assembly session to let the Congress prove its majority, party leader Rahul Gandhi on Friday said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X