వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ తీర్థం, ఉప ఎన్నికల్లో టిక్కెట్లు పక్కా, యుద్ధమే, సీఎం ధీమా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన అనర్హత ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ టిక్కెట్లు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు. 16 మంది అనర్హత ఎమ్మెల్యేలు గురువారం ఉదయం బెంగళూరులో సీఎం యడియూరప్ప, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు నిళిల్ కుమార్ కటీల్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బెంగళూరు నగరంలోని శివాజీనగర్ అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్ మాత్రం ఇంకా బీజేపీలో చేరలేదు.

నిన్న మోదీ, నేడు వైఎస్ జగన్, రేపు మీరే సీఎం, హీరో విజయ్ కు ఆశలు రేపుతున్న పీకే, జస్ట్ !నిన్న మోదీ, నేడు వైఎస్ జగన్, రేపు మీరే సీఎం, హీరో విజయ్ కు ఆశలు రేపుతున్న పీకే, జస్ట్ !

సీఎం యడియూరప్ప ధీమా

సీఎం యడియూరప్ప ధీమా

కర్ణాటకలోని బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన 17 మంది ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో వారికి తమ పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అధ్యక్షతన జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారిలో 16 మంది బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలు అందర్నీ గెలిపించుకుంటామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు

సుప్రీం కోర్టు తీర్పు

కర్ణాటకకు చెందిన 17 మంది అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు వారు ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యవచ్చని బుధవారం తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుతో 17 మంది అనర్హత ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం చిక్కంది. ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేసిన అనర్హత ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు.

15 చోట్ల ఉప ఎన్నికలు

15 చోట్ల ఉప ఎన్నికలు

17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడంతో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అయితే రెండు బెంగళూరు నగరంలోని ఆర్ ఆర్ నగర్, మస్కీ శాసన సభ నియోజక వర్గాల విషయం కోర్టులో విచారణ జరుగుతోంది. మిగిలిన 15 నియోజక వర్గాల్లో డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.

బీజేపీ కోర్ కమిటీ తీర్మాణం

బీజేపీ కోర్ కమిటీ తీర్మాణం

15 నియోజక వర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీ చేయించాలని బీజేపీ నిర్ణయించింది. సుప్రీం కోర్టు తీర్పు తరువాత బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. 15 నియోజక వర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇవ్వాలని, వారందరినీ గెలిపించుకోవాలని బీజేపీ కోర్ కమిటీ తీర్మాణించింది.

ఒక్క లీడర్ కు నో ఎంట్రీ !

ఒక్క లీడర్ కు నో ఎంట్రీ !

15 నియోజక వర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో 14 నియోజక వర్గాల్లో అనర్హత ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. అయితే బెంగళూరు నగరంలోని శివాజీనగర్ నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్ కు టిక్కెట్ ఇచ్చే విషయంలో బీజేపీ నాయకులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రోషన్ బేగ్ కు టిక్కెట్ ఇవ్వాలా ? వద్దా ? అనే విషయం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

బీజేపీకి రెబల్స్ దెబ్బ !

బీజేపీకి రెబల్స్ దెబ్బ !

15 నియోజక వర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడానికి బీజేపీ నాయకత్వం అంగీకరించినా స్థానిక నాయకత్వంలో వ్యతిరేకత ఉంది. స్థానిక నాయకులు ఉప ఎన్నికల్లో ఎక్కడ రెబల్స్ గా బరిలోకి దిగుతారో అనే బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. గరువారం హోస్ కోటే నియోజక వర్గంలో బీజేపీ నాయకుడు శరత్ గౌడ స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు.

అనర్హులకు బీజేపీ తీర్థం

అనర్హులకు బీజేపీ తీర్థం

గురువారం 16 మంది అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే శివాజీనగర్ నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్ మాత్రం గురువారం బీజేపీలో చేరలేదు. రోషన్ బేగ్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఆ నియోజక వర్గం అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.

English summary
Karnataka: BJP in its core committee meeting has decided to give tickets in by elections to all disqualified MLAs who are going to join the party on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X