వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లిం కుటుంబాన్ని తగలబెట్టేందుకొచ్చిన 150 మంది, ధైర్యంగా ఎదుర్కొని కాపాడిన బీజేపీ కౌన్సిలర్

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలం, వ్యతిరేకంగా మొదలైన హింస కొనసాగుతోండగా మత ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఓ గుంపు నుంచి బీజేపీ కౌన్సిలర్ తన స్నేహితుడు అయిన ముస్లిం కుటుంబాన్ని రక్షించాడు. సోమవారం రాత్రి జరిగిన ఘటనను మీడియాకు వివరించాడు.

యుమునావిహర్..

సోమవారం రాత్రి కొందరు ముష్కరులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అంతలో యుమునా విహర్‌లో గల ఓ ముస్లిం ఇంటికి నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ 150 మంది బృందాన్ని బీజేపీ కౌన్సిలర్ ఎదుర్కొన్నాడు. వారి ఇళ్లును నిప్పంటించకుండా అడ్డుకున్నాడు. రాత్రి 11.30 గంటలకు వారంతా వచ్చి జై శ్రీరాం అని నినాదాలు చేశారని గుర్తుచేసుకొని బిక్కుబిక్కుమంటున్నారు.

బ్యారికేడ్లు దాటుకొని..

బ్యారికేడ్లు దాటుకొని..


150 గుంపు జై శ్రీరాం అంటూ కలియతిరిగారు. పక్కనే ముస్లింలు ఎక్కువగా ఉండే చోటకు వచ్చారు. నిరసనకారులు రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేసిన వాటిని దాటుకొని మరీ వచ్చారు. తొలుత అద్దెకు ఉంటోన్న దుకాణాన్ని ద్వంసం చేశారు. కారు, మోటార్ బైక్‌ను కూడా కాల్చాడు. అంతేకాదు పక్కనే గ గ్యారేజ్‌లో ఉన్న కారు, మోటారు వాహనాలకు నిప్పంటించారు. దీంతో భయానక పరిస్థితి ఏర్పడింది. దీంతో తమకు దాదాపు రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు పేర్కొన్నారు.

Recommended Video

Chandrababu Naidu Says 'People Want Development Not Politics' || Oneindia Telugu
ఏడుగురి మృతి...

ఏడుగురి మృతి...

ఆ సమయంలో బీజేపీ కార్పొరేటర్ మాత్రం తన స్నేహితుడు కుటుంబాన్ని కాపాడేందుకు ముందుకొచ్చారు. ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి.. వెంటనే కౌన్సిలర్ వచ్చి.. రెండు నెలల శిశువుతో పాటు ఫ్యామిలీని కాపాడారు. నగరంలో సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనలు జరుగుతోన్న క్రమంలో గుంపు విధ్వంసానికి పాల్పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలో సీఏఏ ఆందోళనతో ఇప్పటికే ఏడుగురు చనిపోగా.. 150 మంది వరకు గాయపడ్డారు.

English summary
BJP councillor saves Muslim family from murderous mob in Yamuna Vihar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X