వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఎంపీపై కత్తులతో దాడి...!

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి బీజేపీ, తృణముల్ పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. ఏకంగా బీజేపీ డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తాపై తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తుంది. డార్జీలింగ్‌లో పర్యటిస్తున్న కాన్వాయ్‌ని సుమారు 100 మంది టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. కత్తులు మరియు పదునైన ఆయుధాలతో ఆయన్ను అడ్డగించినట్టు బీజేపీ అరోపణలు చేస్తోంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో అటు బీజేజీ ఇటు టీఎంసీ కార్యకర్తలకు గాయలయ్యాయి. అయితే వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎంపీ రాజుబిస్తా మూకుమ్మడి దాడి నుండి బయట పడ్డట్టు తెలుస్తోంది.

కాగా డార్జిలింగ్‌లోని సింజి నుండి కలింగ్‌పోంగ్‌కు వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. రోడ్డుపై వెళ్తున్న ఎంపీ కాన్వాయ్‌పై టీఎంసీ కార్యకర్తలు దాడులు చేసినట్టు తెలుస్తోంది. దీంతో వందమంది వరకు మద్యం మత్తులో ఉన్నవారు తమపై దాడి చేసినట్టు బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇందుకోసం స్థానిక పోలీసులు కూడ సహకరించారని పేర్కోన్నారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర గందరగోళం నెలకోంది. ఇక ఈ సంఘటన మరోసారి బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య వివాదానికి దారి తీస్తోంది.

 BJP Darjeeling MP, Raju Bista, attacked

గత పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీజేపీ గెలిచిన తర్వాత తృణముల్ కాంగ్రెస్ మరియు బీజేపీ నేతల మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గుమంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బహిరంగగానే వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ సైతం రాష్ట్రంలో మరింత బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతవరణం కొనసాగుతోంది.

English summary
BJP Darjeeling MP, Raju Bista, attacked in Kalimpong, West Bengal. BJP pins blame on TMC cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X