వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి సాయం: సుష్మా రాజీనామాకు డిమాండ్, అక్కర్లేదన్న షా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ పోర్చుగల్‌ వెళ్లేందుకు అనుమతులు లభించేలా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం స్పందించారు.

ఆదివారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ భోపాల్ గ్యాస్ కేసులో నిందితుడు ఆండర్సన్, భోఫోర్స్ కుంభకోణానికి పాల్పడ్డ ఖత్రోచీకి వీసా జారీ చేస్టున్నట్లు కాంగ్రెస్ భావిస్తోందని అన్నారు. అది సరైంది కాదని, కేంద్ర మంత్రి సిఫారసు చేసింది ఓ భారతీయుడైన లలిత్ మోడికేనని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సుష్మాస్వరాజ్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆమె కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. బ్రిటన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే లలిత్ మోడీకి సహకరించాలని మాత్రమే ఆమె కోరిందని అమిత్ షా స్పష్టం చేశారు.

సుష్మా రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్

లలిత్‌ మోడీ 2010లో లండన్‌ వెళ్లారు. ఆ సమయంలోనే ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఇంగ్లండ్‌ పోలీసులు లలిత్‌మోడీ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. లండన్‌ విడిచి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. లండన్ కోర్టులో కేసు విచారణ ఇంకా జరుగుతూనే ఉంది.

BJP defends Sushma Swaraj, says Lalit Modi was not helped like Warren Anderson, Quattrocchi

అయితే 2014లో లలిత్ మోడీ పోర్చుగల్ వెళ్లారు. పోర్చుగల్ వెళ్లేందుకు వీసా ఇవ్వడానికి ఇంగ్లాండ్‌లోని భారత సంతతి ఎంపీ కీత్‌ వాజ్‌ సాయం చేశారు. ఇప్పుడు అది ఇంగ్లాండ్‌లో పెద్ద వివాదమైంది. దీంతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రోద్బలం వల్లే లలిత్ మోడీకి సాయం చేసినట్లు ఆయన వెల్లడించారు.

దీంతో సుష్మాస్వరాజ్ చిక్కుల్లో పడ్డారు. లలిత్ మోడీ వేరే దేశానికి వెళ్లేందుకు సుష్మా సహకారం అందిస్తున్నారని విపక్షాలు మండిపడటంతో పాటు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ విషయంపై ట్విట్టర్‌లో వివరణ ఇచ్చిన సుష్మా:

లలిత్‌ మోడీ భార్యకు క్యాన్సర్‌ ఉందని, ఆమెకు 2014 ఆగస్టులో పోర్చుగల్‌లో ఆపరేషన్‌ చేసేందుకు ఎర్పాట్లు చేసుకున్నారు. దాని కోసం పోర్చుగల్‌ వెల్లడానికి అనుమతించాలని లలిత్‌ మోడీ 2014 వేసవిలో బ్రిటన్‌ అధికారులను అభ్యర్థించారు.

ఇందుకు ఇంగ్లాండ్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారని, లలిత్ మోడీ పోర్చుగల్ వెళ్లేందుకు అనుమతి ఇస్తే... భారత్, ఇంగ్లాండ్ సంబంధాలపై దెబ్బతింటాయని అప్పటి యూపీఏ ప్రభుత్వం అడ్డుపడిందని అన్నారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నా సాయాన్ని కోరారు. దీంతో మానవతా ధృక్పదంతో ఆమె చికిత్స కోసం సహకరించాల్సిందిగా కోరానని, తానెలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు.

లలిత్ మోడీ అంశంపై సుష్మా స్వరాజ్ ప్రధాని నరేంద్రమోడీతో ఆదివారం ఫోన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. లలిత్ మోడీకి వీసా జారీ వ్వవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా తప్పేంలేదని హోం మంత్రి రాజ్ నాథ్ అన్నారు. మానవతా దృక్పథంతోనే లలిత్ మోడీకి సుష్మ సహాయం చేశారని తెలిపారు.

English summary
In a big relief for External Affairs Minister Sushma Swaraj, Bharatiya Janata Party President Amit Shah backed the minister for helping former Indian Premiere League chief Lalit Modi secure a visa on humanitarian grounds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X