వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో బీజేపీ బృందానికి చుక్కెదురు .. మళ్లీ ఘర్షణలు, పరిస్థితి ఉద్రిక్తం ...

|
Google Oneindia TeluguNews

కోల్ కతా : బెంగాల్ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇటీవల భట్ పరలో బీజేపీ, టీఎంసీ మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితిని సమీక్షించందుకు బీజేపీ ప్రతినిధి బృందం భట్ పర వచ్చింది. అయితే ఘర్షణ జరిగిన చోటకు అగ్రనేతలు రావడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే కొందరు బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పోలీసులు లాఠీ ఝలిపించారు.

క్షేత్రస్థాయిలో పరిశీలన ..
అహ్లువాలియా నేతృత్వంలోని త్రిసభ్య బృందం బెంగాల్ పర్యటించింది. కమిటీ రాష్ట్రంలో పరిస్థితికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక ఇవ్వనుంది. అంతకుముందు చనిపోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలన కమిటీ కలిసింది. వారికి అండగా ఉన్నామనే భరోసా నిచ్చింది. గురువారం భట్ పురలో జరిగిన ఘర్షణతో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇవాళ సీపీఎం, కాంగ్రెస్ సారథ్యంలోని మరో బృందం కూడా సమస్యాత్మక ప్రాంతాలైన బరయిపుర, జగదల్, భట్ పరలో పర్యటించారు. భట్ పర ఘర్షణపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వారు డిమాండ్ చేశారు.

BJP delegation visits Bengals Bhatpara, claims police firing killed 2

మారిన సిచుయేషన్ ...
లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్‌లో పరిస్థితి మారిపోయింది. బీజేపీ కూడా మెజార్టీ సీట్లు సాధించడంతో రాష్ట్రంలో పట్టు సాధించేందుకు తమ వంతు ప్రయత్నిస్తోంది. ఇది నచ్చని దీదీ .. కయ్యానికి కాలుదువ్వడంతో రాష్ట్రంలో అశాంతి చెలరేగింది. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల ఘర్షణలతో ఇప్పటికే పదుల సంఖ్యలో చనిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లపై దాడితో కూడా ఆందోళన నెలకొంది. వారం రోజులు వైద్యులు నిరసన చేపట్టడంతో .. మమత చర్చలు జరిపి భద్రతా కల్పిస్తామని హామీనివ్వడంతో గొడవ సద్దుమణిగింది. మరోవైపు బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా బీజేపీ హై కమాండ్ యోచిస్తోంది. ఈ మేరకు పదే పదే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి పరిస్థితులపై ఆరాతీస్తుండటం పరిస్థితికి అద్దం పడుతుంది.

English summary
BJP delegation, led by former Union minister and Bardhaman-Durgapur MP SS Ahluwalia, visited the trouble-torn Bhatpara area in West Bengal on Saturday and alleged that it was due to police firing that two persons lost their lives during clashes earlier in the week. SS Ahluwalia was accompanied by newly-elected MPs and former police officers Satyapal Singh and BD Ram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X