వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్వంత్‌కు బర్మేర్ సీటు నిరాకరణ, ఇండిపెండెంట్‌గా...

By Pratap
|
Google Oneindia TeluguNews

జైపూర్: సీనియర్ నేత జస్వంత్ సింగ్‌కు భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాజస్థాన్‌లోని బర్మేర్ సీటు టికెట్‌ను నిరాకరించింది. ఈ మేరకు బిజెపి శుక్రవారంనాడు నిర్ణయం తీసుకుంది. ఈ స్థానం నుంచి కాంగ్రెసు నుంచి తమ పార్టీలో చేరిన మాజీ శాసనసభ్యుడు సోనారామ్‌కు ఇవ్వాలని బిజెపి నిర్ణయిచింది.

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ లోకసభ సీటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జస్వంత్ సింగ్ ఈసారి రాజస్థాన్‌లోని బర్మేర్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. డార్జిలింగ్‌కు తాను ఎంతో చేశానని, చేయాల్సిందంతా చేశానని, ఎన్నికల్లో తన చివరి పోటీ ఇది అని, దాంతో తన సొంత ప్రాంతంలో పోటీ చేయాలని అనుకున్నానని జస్వంత్ సింగ్ అన్నారు.

BJP denies Jaswant Singh Lok Sabha ticket from Barmer

తనకు బర్మేర్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని ఆయన అంతకు ముందు చెప్పారు. దీంతో ఆయన ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేసే అవకాశం ఉంది. బర్మేర్‌ స్వగ్రామం జసోల్ బర్మేర్ జిల్లాలో ఉంది. ఆయన కుమారుడు మన్వీందర్ సింగ్ రెండు సార్లు ఈ స్థానం నుంచి పోటీ చేశారు.

బర్మేర్ నుంచి సోనారామ్‌ను పోటీకి దించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే అనుకుంటున్నారు. ఝాట్ ప్రజలు ఎక్కువ మంది ఉండడంతో ఝాట్ అభ్యర్థి అయితే విజయం సానుకూలమవుతుందని ఆమె భావిస్తున్నారు.

English summary
In a major development, the Bharatiya Janata Party on Friday denied former union minister Jaswant Singh Lok Sabha ticket from Barmer in Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X