వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీశ్‌తో దూరంగా కమలం..? ఎన్నికల వేళ ఎత్తుగడనా.. చిరాగ్‌కు ఇండెరెక్టుగా సపోర్ట్‌లో ఆంతర్యం...?

|
Google Oneindia TeluguNews

మరికొద్దీ గంటల్లో బీహర్ అసెంబ్లీ తొలి విడత పోలింగ్ జరగబోతోంది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగబోతుండగా.. బీహర్ రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. మిత్రపక్షాలు కూడా కాస్త దూరంగా ఉంటున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి ఊతం ఇచ్చేట్టు జేడీయూ- బీజేపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయి. జేడీయూతో బీజేపీ దూరంగా ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

 దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా: హోం ఐసోలేషన్‌లో బీహర్ బీజేపీ ఇంచార్జీ, టెస్ట్ చేసుకోవాలని.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా: హోం ఐసోలేషన్‌లో బీహర్ బీజేపీ ఇంచార్జీ, టెస్ట్ చేసుకోవాలని..

చిరాగ్ పాశ్వాన్ విమర్శించినా..

చిరాగ్ పాశ్వాన్ విమర్శించినా..


నితీశ్ కుమార్‌పై చిరాగ్ పాశ్వాన్ బాహాటంగా విమర్శలు చేసిన ఎల్జేపీ గురించి బీజేపీ విమర్శించలేదు సరికాదా ప్రస్తావించలేదు. అయితే ఇటీవల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమికి ఓటేయాలని కోరారు. ప్రసంగం చివరలో సీఎం నితీశ్ కుమార్ పేరును ప్రస్తావించారు. దీంతోపాటు జేడీయూ ర్యాలీలలో డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాత్రమే పాల్గొన్నారు. మిగతా అగ్రనేతలు ఎవరూ రాలేదు. అయితే సుశీల్ మోడీకి కరోనా వైరస్ రావడంతో.. జేడీయూ ఒంటరిగానే ప్రచారం చేసింది.

మోడీ నో-నితీశ్ నో

మోడీ నో-నితీశ్ నో


దీనికితోడు బీజేపీ వీడియో ప్రచారంలో కూడా నితీశ్ కుమార్ పేరును ప్రస్తావించలేదు. ప్రధాని మోడీ పేరును ఉంచింది. బీజేపీ మాదిరిగానే జేడీయూ కూడా నితీశ్ పేరుతో క్యాంపెయిన్ చేస్తోంది. పోస్టర్లు, ర్యాలీలలో కూడా మోడీ పోస్టర్లు మాత్రమే కనిపించాయి. దీనిని బట్టి మోడీ, అమిత్ షా మాత్రమే తమ ప్రచార అస్త్రాలు అని బీజేపీ సంకేతం ఇచ్చింది. అంతేకాదు గత మూడు ప్రచార సందర్భాల్లో ప్రధాని మోడీ నితీశ్ పేరు ప్రస్తావించకపోవడం విశేషం.

Recommended Video

Bihar Polls 2020 : మరోసారి Nitish Kumar కు పట్టం కట్టబోతున్న బీహర్ ప్రజలు.. ABP సర్వే వెల్లడి!
నితీశ్‌పై వ్యతిరేకత

నితీశ్‌పై వ్యతిరేకత

అయితే నితీశ్ కుమార్‌పై బీజేపీలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలు ఆ విధంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల పట్ల నితీశ్ కుమార్ ఉదాసీన వైఖరి.. ప్రజల బాధలను పట్టించుకోకపోవడంపై కూడా గుస్సా మీదున్నారు. దీనిని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెరపైకి తీసుకొచ్చారు. నితీశ్ క్లీన్ ఇమేజ్ ఉన్న.. మద్య నిషేధం, అవినీతితో చెడ్డ పేరు వస్తోంది. దీనికితోడు చిరాగ్‌తో ఇండెరెక్టుగా సపోర్ట్ ఇవ్వడంతో ఏం జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయి.

English summary
BJP video campaign has no mention of Nitish Kumar. BJP hoardings across the state portray PM Modi. Janata Dal United campaign also talks only about Nitish Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X