మళ్లీ వార్తల్లోకెక్కిన పండలం మున్సిపాలిటీ: వ్యూహాత్మకంగా బీజేపీ: మహిళలే మహరాణులు
తిరువనంతపురం: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా రెండు మున్సిపాలిటీలపై కాషాయ జెండాను ఎగురవేయగలిగింది. అందులోనూ చారిత్రాత్మక నేపథ్యం గల పండలం మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోగలిగింది. అయ్యప్ప స్వామి బాల్యంతో ముడిపడి ఉన్న ప్రదేశం ఇది. అయ్యప్పను పెంచుకున్న పండలరాజు పరిపాలించిన ఒకప్పటి సంస్థానం ఇది. ఇక్కడ బీజేపీ విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా- మరోసారి ఈ మున్సిపాలిటీ వార్తల్లోకి ఎక్కింది.
ప్రచ్ఛన్నయుద్ధం: చైనాయులకు భారత్‌లో నో ఎంట్రీ: విమానం ఎక్కితే..అంతే: కేంద్రం కఠిన ఆదేశాలు?
పండలం మున్సిపాలిటీ ఛైర్మన్ ఎంపిక వ్యవహారంలో బీజేపీ కేరళ రాష్ట్రశాఖ నాయకులు వ్యూహాత్మంగా నిర్ణయాలను తీసుకున్నారు. ఛైర్మన్ స్థానానికి మహిళను ఎంపిక చేశారు. నిజానికి- ఇది జనరల్ కేటగిరి సీటు. అయినప్పటికీ.. మహిళను ఎన్నుకున్నారు. సుశీలా సంతోష్‌కు పండలం మున్సిపాలిటీ ఛైర్ పర్సన్‌గా నియమించారు. మహిళకు కేటాయించిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ స్థానం కోసం యు రమ్యను ఎంపిక చేశారు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లోవారిద్దరూ ఘన విజయాన్ని సాధించారు.

ఈ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ నుంచి మొత్తం 18 మంది కౌన్సిలర్లు ఎన్నిక కాగా.. వారిలో 14 మంది మహిళలే. 33 సీట్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో బీజేపీ అత్యధికంగా 18 సీట్లను గెలచుకోగలిగింది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్-5, అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్‌కు తొమ్మిది స్థానాలు మాత్రమే దక్కాయి. మరొక చోట స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించారు. అయ్యప్పస్వామి, శబరిమల ఆలయం, ట్రావెన్కూర్ దేవస్వొం బోర్డుతో ముడిపడి ఉన్న పండలం మున్సిపాలిటీని గెలుచుకోవడాన్ని బీజేపీ నేతలు శుభసూచకంగా భావిస్తున్నారు.