నువ్వు మాకోద్దు... కుల్దిప్ సింగ్‌ను బహిష్కరించిన బీజేపీ
పార్టీ ఎమ్మెల్యే రేప్ చేసి, అనంతరం సాక్ష్యాలు లభించకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడ స్పందించని బీజేపీ హైకమాండ్, బాధితురాలి హత్య చేసేందుకు కుట్ర పన్నడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేపై వేటు వేసింది. ఇన్నాళ్లు వేచి చూసే ధోరణి అవలంబించడంతో జరిగిన ఘోరం అంతా అయిపోయంది. ఎమ్మెల్యే చేసిన కుట్రలకు ఇద్దరు బలికాగా మరో ఇద్దరు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిల్లో ఎమ్మెల్యే వ్యవహారం తమ మెడకు చుట్టుకోకుండా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్‌ను పార్టీ నుండి తొలగిస్తూ నిర్ణయం రాష్ట్రా బీజేపీ తీసుకుంది.

ఎట్టకేలకు ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ పై వేటు,
ఉత్తరప్రదేశ్ బీజేపీ హైకమాండ్ జరిగిన నష్టం జరిగిపోయిన తర్వాత యూపీ బీజేపీ నేతలు తేరుకున్నారు. తేరుకుంది. ఉద్యోగం కోసం వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి, అనంతరం సాక్ష్యాలు లేకుండా చేసేందుకు కూడ అనేక ప్రయత్నాలు చేసిన ఎమ్మెల్యేను ఇన్నాళ్లు ఉపేక్షించి మరో సిబిఐ కేసు నమోదైన తర్వాత ఎమ్మెల్యేను పార్టీ నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రమాదంపై సీబీఐ విచారణ
కాగా ఉన్నావో అత్యాచార భాదితురాలిని హత్య చేయాలని ప్రయత్నాలు చేయడంతో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే... ఈనేపథ్యంలోనే హత్య కుట్రను సాధారణంగా చీత్రీకరించేందుకు ప్రయత్నాలు చేసిన పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎమ్మెల్యేపై హత్య నేరాన్ని నమోదు చేశారు. దీంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో విచారణకు ఆదేశించింది.

సుమోటోగా తీసుకున్న సుప్రిం కోర్టు
మరోవైపు అత్యాచార బాధితురాలు రాసిన లేఖను సుప్రిం కోర్టు సుమోటగా సుప్రిం కోర్టు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే అత్యాచారానికి సంబంధించిన కేసులన్నింటిపై దృష్టి సారించిన ఉన్నత న్యాయస్థానం వాటిని ఉత్తర ప్రదేశ్‌నుండి డిల్లీకి మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఏకంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ రంజన్ గగోయ్ కేసును విచారిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే పార్టీ ఎమ్మెల్యేపై వేటు వేసింది. కాగా అంతకు ముందే ఎమ్మెల్యేను కనీసం పార్టీ నుండి సస్పెండ్ చేయలేదనే ఆరోపణలను పార్టీ ఎదుర్కోంది. దీంతో ముందు జాగ్రత్తగానే వేటు నిర్ణయం తీసుకుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!