వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఓటమి స్వయంకృతాపరాధమేనన్న ఎంపీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీ ఘోర వైఫల్యం చెందింది. బీజేపీ ఓటమికి కారణం స్వయంకృతాపరాధమేనా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అది కూడా సొంత నేతల నుంచే ఈ వాదన వినపడటం విశేషం. బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిర నిర్మాణం, రాష్ట్రవ్యాప్తంగా రాముని విగ్రహాల ఏర్పాటు, ఆయా నగరాల పేర్లలో మార్పు చేస్తామని చెప్పడంతోనే బీజేపీ ఓటమి పాలైందన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ కకాడే.

BJP forgot development, started focussing on mandir,says party’s Rajya Sabha MP Sanjay Kakade

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ఓటమి పాలవుతుందని తాను ముందే ఊహించినట్లు చెప్పారు సంజయ్ కకాడే. కానీ మధ్యప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి వేరుగా ఉందని చెప్పారు. 2014 మోడీ చేస్తానని చెప్పిన అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడం మానేసి రామమందిర నిర్మాణం, రాముని విగ్రహాలు, నగరాల పేర్లు మార్పుల గురించి చెప్పడంతోనే బీజేపీ నష్టం చవిచూసిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలువగా... రాజస్థాన్‌లో కూడా ప్రభుత్వాన్ని హస్తంపార్టీ ఏర్పాటు చేయనుంది. మధ్యప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్ బీజేపీల మధ్య పోరు నువ్వానేనా అన్న స్థాయిలో ఉంది. ఇక్కడ బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు.

ఇప్పటి వరకు ఉత్తర భారతం అంతా కాషాయమయం కాగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాషాయం పార్టీకి బ్రేక్ పడుతుంది. అంతేకాదు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. సొంత పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కకాడేకు ఇది తొలిసారి కాదు. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు బీజేపీకి వస్తాయా లేదా అనేది నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సి సంఖ్యాబలం తెచ్చుకుంటుందని కామెంట్ చేశారు.

English summary
BJP Rajya Sabha MP Sanjay Kakade has hinted that his party’s focus on building the Ram Mandir at Ayodhya and statues along with changing names of places had contributed to the party’s poor showing in the Assembly elections.“I knew we would lose in Rajasthan and Chhattisgarh but MP trends have come as a surprise. I think we forgot the issue of development that Modi took up in 2014. Ram Mandir, statues and name-changing became the focus,” he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X