వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విపక్షాల మద్దతుతోనే బీజేపీకి అధికారం... అకాళీదల్ నేతలు

|
Google Oneindia TeluguNews

చివరి దశ ఎన్నికలు పూర్తవుతున్న నేపథ్యలంలో బీజేపీ గెలుపుపై ఆపార్టీ లోనే భిన్నస్వరాలు వినపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ గాలి వీస్తూందని బీజేపీనేతలు ఓవైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు ఆపార్టీలో ఉన్న ముఖ్యనేతలె పార్టీ గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే గతంలో వచ్చిన పూర్తి మెజారిటి పార్టీకి రాకపోవచ్చని చెబుతున్నారు. అధికారంలోకి రావాలంటే ఇతర పక్షాల సహకారం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

బీజేపీ పూర్ద మెజారీటీపై సన్నగిల్లుతున్న ఆశ...

బీజేపీ పూర్ద మెజారీటీపై సన్నగిల్లుతున్న ఆశ...

బీజేపీ గెలుపై రోజురోజుకు ఆపార్టీ నేతల్లో విశ్వాసం సన్నగిల్లుతుందా..ఔర్ ఎక్ బార్ మోడీ నినాదం ప్రజల్లోకి వెళ్లలేదా..అంటే అవుననే ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మరో రెండు దశల ఎన్నికలు మిగిలిఉన్నాయి. ఉప్పటికే ఎనబై శాతం ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ నేతలు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ముందునుండి చెబుతున్నట్టుగా పార్టీకీ పూర్తి మెజారీటి రాకపోవచ్చని ఆపార్టీ ముఖ్యనేతలే భావిస్తున్నారు.

మిత్రపక్షమైన అకాళీదల్ ఎంపీ

మిత్రపక్షమైన అకాళీదల్ ఎంపీ

తాజాగా బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాళీదల్ రాజ్యసభ ఎంపీ పార్టీ గెలుపుపై స్పందించారు. ఈ ఎన్నికల్లో గతంలో కంటే తక్కువ సీట్లు వస్తాయని ఎంపీ నరేష్ గుజ్రాల్ వ్యాఖ్యానించారు. విపక్షాల మద్దతుతోనే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. దీంతో ప్రతి పార్టీకి కేంద్ర కేబినెట్ స్థానం కల్పించే అవకాశం వస్తుందని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ లోని జలందర్ లో పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో రాంమాధవ్ సైతం ఇదే వ్యాఖ్యలు

గతంలో రాంమాధవ్ సైతం ఇదే వ్యాఖ్యలు

కాగా కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సైతం ఇదే అంశాన్ని ప్రస్థావించారు. పార్టీ అధికారంలోకి రావాలంటే విపక్షాల మద్దతు తీసుకోవడం తప్పదని అన్నారు. ఈనేపథ్యంలోనే బీజేపీకే స్వంతంగా 270 సీట్లు వస్తే సంతోషమే అంటూ ఆయన వ్యాఖ్యానించడంతోపాటు ఈశన్య ఉత్తరాదీ రాష్ట్ర్రాల్లో పుంజుకుంటాము కాని అదే రీతీలో దక్షిణాదీలో అదే ఫలితాలు ఉంటే బాగుంటుందంటూ ఆయన చెప్పడం వెనక బీజేపీ పూర్తి మెజారీటీతో ఈసారి గెలుపోందే అవకాశాలు సన్నగిల్లుతున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. మరోవైపు బీజేపీ స్వంతగా 220 నుండి 230 సీట్లు వస్తే ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండరని ఆపార్టీ సీనీయర్ నేత సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు.

దక్షిణాదిలో గెలుపుపై అనుమానాలు

దక్షిణాదిలో గెలుపుపై అనుమానాలు

మొత్తం మీద ఆపార్టీ స్వంతనాయకుల మాటలతో పాటు దక్షిణాదిలో బీజేపీకి సన్నగిల్లుతున్న ఆశలు ఆపార్టీకి ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉత్తరాధిలో పశ్చిమబెంగాల్ పై పూర్తిగా ఫోకస్ పెట్టిన నరేంద్ర మోడీ తృణముల్ కాంగ్రెస్ పై ఏమేరకు విజయం సాధిస్తారనే పరిస్థితి పై అధికారం ఆధారపడి ఉంది. ఈశాన్య రాష్ట్ర్రాల్లో కూడ కొంత పార్టీకి ఇబ్బందికర పరిణామాలే ఎదుర్కోంటుంది. దీంతో స్వపక్షంలోనే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
will bjp get full mejarity in the elections, but why bjp party own leaders getting doubt on winning seats,party leader hope that bjp will get into power with other parties support
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X