
GOA CM: టెన్షన్ లో గోవా లీడర్స్, కొత్త సీఎం ఎవరు ?. పరిశీలకులను పంపించిన బీజేపీ హైకమాండ్, రాత్రికి !
గోవా/బెంగళూరు/న్యూఢిల్లీ: గోవా రాజకీయాలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. అయితే గోవాలో 20 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ముగ్గురు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు, ఎంజీఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఇస్తున్నారు. 25 మంది ఎమ్మెల్యేల బలం పెంచుకున్న బీజేపీ గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యింది. అయితే ఇప్పటికే గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ప్రమోద్ సావంత్ మరోసారి సీఎం అవుతారా ? లేదా ? అనే విషయంపై బీజేపీ హైకమాండ్ పక్కా క్లారిటీ ఇవ్వలేదు. సోమవారం గోవా తాత్కాలిక స్పీకర్ గా గణేష్ గాంవ్కర్ ఎన్నిక అయ్యారు. మంగళవారం ఉదయం 11. 30 గంటలకు గోవా ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణస్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూర్తి అయిన తరువాత గోవా కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం వెలుగు చూడనుంది. ఇప్పటికే గోవా కొత్త సీఎం ఎవరు అనే విషయం నిర్ణయించడానికి బీజేపీ హైకమాండ్ ఇద్దరు పరిశీలకులను నియమించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గోవా పరిశీలకులుగా నియమించారు. ప్రమోద్ సావంత్ కు మరోసారి సీఎం అయ్యే చాన్స్ ఇస్తారా ?, సీన్ లోకి మరో వ్యక్తి పేరు వస్తుందా ? అనే విషయంపై గోవాలో టెన్షన్ మొదలైయ్యింది.
Illegal
affair:
ప్రియుడితో
పాటు
భార్యను
చంపేసిన
ఆంటీ,
కొత్త
లవర్
తో
స్కెచ్,
కోట్ట
ఆస్తి
కోసం!

బీజేపీకి లైన్ క్లియర్
గోవాలో 20 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే ముగ్గురు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారు. అయితే మంచి రోజు చూసి గోవాలో ముఖ్యమంత్రి సీటులో ఓ నాయకుడిని కుర్చో బెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ టీమ్ ఇప్పటికే డిసైడ్ అయ్యింది.

హైకమాండ్ ఆదేశాలతో సీఎం రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యే ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆయన పదవికి రాజీనామా చేశారు. శనివారం పణజిలోని రాజ్ భవన్ లో గరవ్నర్ శ్రీధరన్ పిళ్లైని కలిసిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆయన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. గోవాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది.

గోవాలో బీజేపీ ప్రభుత్వం గ్యారెంటి
గోవా రాజకీయాలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. అయితే గోవాలో 20 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ముగ్గురు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు, ఎంజీఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఇస్తున్నారు. 25 మంది ఎమ్మెల్యేల బలం పెంచుకున్న బీజేపీ గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యింది.

ముహూర్తం ఫిక్స్ చేసిన బీజేపీ
ఇప్పటికే గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ప్రమోద్ సావంత్ మరోసారి సీఎం అవుతారా ? లేదా ? అనే విషయంపై బీజేపీ హైకమాండ్ పక్కా క్లారిటీ ఇవ్వలేదు. సోమవారం గోవా తాత్కాలిక స్పీకర్ గా గణేష్ గాంవ్కర్ ఎన్నిక అయ్యారు. మంగళవారం ఉదయం 11. 30 గంటలకు గోవా ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణస్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూర్తి అయిన తరువాత గోవా కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం వెలుగు చూడనుంది.

రాత్రికి సీఎం ఎవరో తెలిసిపోతుంది
ఇప్పటికే గోవా కొత్త సీఎం ఎవరు అనే విషయం నిర్ణయించడానికి బీజేపీ హైకమాండ్ ఇద్దరు పరిశీలకులను నియమించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గోవా పరిశీలకులుగా నియమించారు. సోమవారం సాయంత్రం పణజిలో గోవా బీజేపీ ఎమ్మెల్యే సమావేశం నిర్వహించి కొత్త సీఎం ఎవరు అనే విషయంపై చర్చించనున్నారు.

సీక్రేట్ గా పెట్టిన బీజేపీ హైకమాండ్
ప్రమోద్ సావంత్ కు మరోసారి సీఎం అయ్యే చాన్స్ ఇస్తారా ?, సీన్ లోకి మరో వ్యక్తి పేరు వస్తుందా ? అనే విషయంపై గోవాలో టెన్షన్ మొదలైయ్యింది. గోవా కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో బీజేపీ హైకమాండ్ చాలా సీక్రేట్ గా అందరి అభిప్రయాలు తెలుసుకుందని, ఎమ్మెల్యేలు, నాయకులు అభిప్రాయాల మేరకే కొత్త సీఎం పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.