వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాలో కీలకమలుపు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించిన గవర్నర్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆపార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. గత ప్రభుత్వం గడువు తొమ్మిదవ తేది అర్థరాత్రిన ముగియనుండడంతో ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారమే రాజీనామా చేశారు. కాగా ఫడ్నవీస్‌ను బీజేపీ ఎల్పీ నాయకుడిగా ఎన్నుకోవడంతో ఆయన్నే తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని గవర్నర్ ఆహ్వానించారు.

మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన అభ్యర్థి..శరద్ పవార్ రేసులో లేరు: సంజయ్ రౌత్మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన అభ్యర్థి..శరద్ పవార్ రేసులో లేరు: సంజయ్ రౌత్

 11న బలనిరూపణ

11న బలనిరూపణ

నవంబర్‌ 11 తేదీలోపు బలన్నీ నిరూపించుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్‌ నుంచి ఓ ప్రకటన వెలువడింది. కాగా ఫలితాలు విడుదలై 15 రోజులకుపైగా గడుస్తున్నా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని విషయ తెలిసిందే. సీఎం పీఠం, పదవుల పంపకాలపై బీజేపీ-శివసేన కూటమి మధ్య ఏర్పడిన విభేదాలే దీనికి ప్రధాన కారణం.

బీజేపీ 105 బలం

బీజేపీ 105 బలం

ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ పదవీకాలం ఈనెల 8న ముగియడంతో దేవేంద్ర ఫడ్నవిస్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి తొలుత అవకాశం ఇవ్వాలి కాబట్టి గవర్నర్‌ వారిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన కనీస బలం 145 బీజేపీ లేదు. దీంతో ముఖ్యమంత్రిగా దేవెంద్ర ఫడ్నవీస్ ఎలా తన బలాన్ని నిరూపించుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

 ఏయో పార్టీలకు అవకాశం

ఏయో పార్టీలకు అవకాశం

కాగా మొత్తం మొత్తం మహారాష్ట్రలో 288 సీట్లు ఉండగా బీజేపీ 105 శివసేనకు 56 స్థానాలు, ఎన్సీపీకి 44 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో గెలుపోందాయి. ఒకవేళ బీజేపీ, శివసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో 161 స్థానాలతో ప్రభుత్వం కొనసాగనుంది. లేదంటే బీజేపీ ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే 159 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా నలబై స్థానాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో అంతమందిని ఎలా తీసుకువస్తారనే వేచి చూడాలి. ఒక వేళ బీజేపి తనబలాన్ని నిరూపించుకోలేని పక్షంలో కాంగ్రెస్ ,శివసేన ,ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ అహ్వానించనున్నారు. అయితే ఈ మూడు పార్టీలు ఇప్పటి వరకు ఎలాంటీ సంకేతాలను ఇవ్వలేదు.

English summary
Governor of the state of Maharashtra, Bhagat Singh Koshyari has taken a key decision in the wake of the stalemate in the state. BJP has been invited to form government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X