బీజేపీలో 'బ్రహ్మచారులు' ఎక్కువ! అందుకే వారికి ఆ విషయం తెలియలేదు..
నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులంతా ఇక్కట్లు పడుతుంటే.. పెళ్లిళ్లు ఇతరత్రా శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకున్నవారి పరిస్థితి ప్రస్తుతం ఎటూ పాలుపోని విధంగా తయారైంది. బ్యాంకుల నుంచి రూ.2.5లక్షలు విత్ డ్రా చ
న్యూఢిల్లీ : నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులంతా ఇక్కట్లు పడుతుంటే.. పెళ్లిళ్లు ఇతరత్రా శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకున్నవారి పరిస్థితి ప్రస్తుతం ఎటూ పాలుపోని విధంగా తయారైంది. బ్యాంకుల నుంచి రూ.2.5లక్షలు విత్ డ్రా చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా.. పెళ్లిళ్లకు ఆ మొత్తం సరిపోవనేవారు లేకపోలేదు.

తాజాగా ఇదే విషయంపై స్పందించారు యోగా గురువు బాబా రాందేవ్. బహుశా బీజేపీలో ఎక్కువమంది బ్రహ్మచారులు ఉండడం వల్లే.. పెళ్లిళ్ల సీజన్ లో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని ఛలోక్తులు విసిరారు రాందేవ్. పార్టీలో ఎక్కువమంది బ్రహ్మచారులే ఉండడంతో.. పెళ్లిళ్ల సీజన్ అని వారికి తెలిసి ఉండకపోవచ్చునని సరదాగా వ్యాఖ్యానించారు.
మరో నెలరోజుల పాటు వేచి చూసి.. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే దేశంలో జరుగుతున్న పెళ్లిళ్లకు ఇబ్బందులు తలెత్తేవి కావని పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల కట్నం లేని పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయని, ఇది కూడా ఒకవిధంగా మంచి పరిణామమే అన్నారు రాందేవ్.












Click it and Unblock the Notifications