వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: మాజీ క్రికెటర్లు అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ కు బీజేపీ గాలం !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Rahul Dravid,kumble Got Invitation From BJP

బెంగళూరు: కర్ణాటకలో మే 12వ తేదీ శాసన సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం బీజేపీతో పాటు జేడీఎస్ పార్టీ నాయకులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా బీజేపీ నేతలు టీం ఇండియా మాజీ దిగ్గజాలు రాహుల్ ద్రావిడ్, అనీల్ కుంబ్లేకి గాలం వేశారని, వారితో అనేకసార్లు చర్చలు జరిపారని వెలుగు చూసింది.

యువతలో క్రేజ్ !

యువతలో క్రేజ్ !

టీం ఇండియాలో అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ కు క్లీన్ చిట్ ఉంది. ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ వారి క్రికెట్ కెరీర్ పూర్తి చేశారు. యువతలో అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ కు మంచి క్రేజ్ ఉంది.

యువ ఓటర్లు టార్గెట్

యువ ఓటర్లు టార్గెట్

యువ ఓటర్లను ఆకర్షించడానికి అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ ను బీజేపీ నాయకులు పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం. అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ కర్ణాటకకు చెందిన వారే కావడంతో బీజేపీ నాయకులు వారితో చర్చలు జరిపారని తెలిసింది.

కుంబ్లే సన్నిహితులు

కుంబ్లే సన్నిహితులు

అనీల్ కుంబ్లే సన్నిహితుల తెలిపిన వివరాల ప్రకారం శాసన సభ ఎన్నికలు తేదీ ప్రకటించిన నాటి నుంచి బీజేపీ నాయకులు ఆయన్ను, రాహుల్ ద్రావిడ్ ను అనేకసార్లు కలిసి పార్టీలో చేరాలని ఆహ్వానించారని, అనేకసార్లు చర్చలు జరిగాయని సమాచారం.

కుంబ్లే, ద్రావిడ్ క్లారిటీ

కుంబ్లే, ద్రావిడ్ క్లారిటీ

కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం రాహుల్ ద్రావిడ్, అనీల్ కుంబ్లేకి చాల క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ ను పార్టీలోకి ఆహ్వానించారని తెలిసింది. రాజకీయాలకు దూరంగా ఉండాలని బీజేపీ ఆహ్వానాన్ని అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ సున్నితంగా తిరస్కరించారని తెలిసింది.

English summary
BJP has tried to field Kannadiga cricketers Rahul Dravid and Anil Kumble for Karnataka assembly elections 2018. But sources said, both former captains of team india were refused to join party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X