వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాటుతో దాడిచేసిన ఆకాశ్‌కు బీజేపీ నోటీసులు.. మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో చర్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఇండోర్ మున్సిపల్ అధికారిపై బ్యాటుతో ఝులిపించిన మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గియకు బీజేపీ హైకమాండ్ నోటీసులు ఇచ్చింది. అధికారిపై ఎందుకు దాడిచేశారో వివరణ ఇవ్వాలని అందులో స్పష్టంచేసింది. అధికారిపై ఆకాశ్ దాడిని మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో మోడీ తప్పుపట్టిన సంగతి తెలిసిందే.

సహించబోం ..
ఆకాశ్ దురుసు ప్రవర్తనపై బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఏకంగా మున్సిపల్ అధికారిని బ్యాటుతో కొట్టడమేంటని ప్రశ్నిస్తోంది. దీనిపై ఆకాశ్‌కు నోటీసులు జారీచేసింది. ఎందుకలా ప్రవర్తించాడో తెలుపాలని పేర్కొంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే నేతలు తమకు వద్దని కుండబద్దలు కొట్టింది. మరోవైపు ఆకాశ్ దాడికి సంబంధించి నివేదిక ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మధ్యప్రదేశ్ బీజేపీని వివరణ అడిగిన సంగతి తెలిసిందే. ఘటనకు దారితీసిన పరిస్థితులపై కూడా ఆరాతీశారు.

bjp high command notice to akash

ఏం జరిగిందంటే ..?
గత నెల 26న ఇండోర్ మున్సిపాల్ కార్యాలయం వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గీయ హంగామా సృష్టించాడు. ఇండోర్ మున్సిపాలిటీ వద్ద అధికారిపై తిట్లపురాణం ప్రారంభించాడు. కోపం ఆపుకోలేక అక్కడే ఉన్న బ్యాటుతో దాడి చేశాడు. అతను దాడిచేస్తున్న సమయంలో ప్రజలు అక్కడే ఉన్నారు. అయినా ఏం బెదరకుండా తన పనిని పూర్తిచేశాడు. ఏం జరిగిందని అక్కడున్న మీడియా ప్రతినిధులు ఆకాశ్‌ను అడగ్గా .. అధికారులు అక్రమంగా ఓ భవనాన్ని కూల్చివేశారని పేర్కొన్నాడు. ఆ భవనాన్ని కూల్చివేయాలని యాజమాని కార్పొరేషన్ కోరడం విశేషం. అయితే అందులో కొందరు నివసిస్తున్నారని ఎమ్మెల్యే వాదిస్తున్నారు. ఇదే విషయం అడిగేందుకు ఫోన్ చేస్తే తన కాల్ లిప్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓటువేసిన ప్రజలకు ప్రతినిధినని .. వారికి సంబంధించి బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. అయితే తనను మళ్లీ సంప్రదించకుండా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోపగించుకున్న ఆకాశ్ .. మున్సిపల్ అధికారిపై చేయిచేసుకున్నాడు.

English summary
Madhya Pradesh BJP MLA Aakash Vijay Vargiya has been given notice by the BJP High Command in a baton against an Indore municipal officer. The clarification was made to explain why the officer was attacked. Narendra Modi's statement came at a BJP parliamentary party board meeting on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X