వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆశల మీద నీళ్లు చల్లిన హై కమాండ్: చెప్పింది చెయ్యండి !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఊహించని దానికంటే ఎక్కువ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని ఆనందంతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప ఆశల మీద బీజేపీ హై కమాండ్ నీళ్లు చల్లించదని సమాచారం. అమిత్ షా ఆదేశాలతో బీఎస్ యడ్యూరప్ప ఆశపడుతున్న సీఎం పదవి ఇప్పుడే దక్కేటట్లు కనిపించండం లేదు.

సీఎం కావాలని ఆశతో ఉన్న బీఎస్ యడ్యూరప్ప ఆశలు ఇప్పట్లో తీరేటివిగా కనిపించడం లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చెయ్యకూడదని బీఎస్. యడ్యూరప్పకు బీజేపీ హై కమాండ్ సూచించిందని సమాచారం.

BJP high command told Karnataka BJP president Yeddyurappa to stop operation kamala

ఢిల్లీ వెళ్లిన యడ్యూరప్ప అమిత్ షాతో పాటు బీజేపీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంలో బీఎస్ యడ్యూరప్పకు అమిత్ షా కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఆపరేషన్ కమలతో కర్ణాటకలో అధికారంలోకి రావాలని యడ్యూరప్ప అండ్ కో ఎదురుచూస్తోంది.

సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తే అది మరింత బలపడే అవకాశం ఉందని, అందుకే దాన్ని అలాగే వదిలేయాలని బీఎస్ యడ్యూరప్పకు అధిష్టానం సూచించిందని తెలిసింది. సీఎం కుమారస్వామి ప్రభుత్వాన్ని మనం పట్టించుకోరాదని యడ్యూరప్పకు సూచించారని సమాచారం.

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నాలు చేసి విఫలం అయ్యింది. మహారాష్ట్రలో చేసిన పనికి బీజేపీ మీద విమర్శలు వచ్చాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న పార్టీ మరింత బలపడటంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అందువలన సమయం కోసం వేచి చూడాలని బీఎస్ యడ్యూరప్పకు అధిఫ్టానం సూచించింది.

English summary
BJP high command told Karnataka BJP president Yeddyurappa to stop operation kamala, and stop trying to collapse coalition government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X