వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఎన్నికలు: కాంగ్రెస్ ఓటు షేరును పెంచుకుని బీజేపీ నెత్తిన పాలు పోస్తుందా..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు ఆసక్తిని రేకిస్తున్నాయి. అక్కడ త్రిముఖ పోటీ నెలకొనడంతో దేశం ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. వరుస పరాజయాలు బీజేపీని వెంటాడుతుండగా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటా అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు స్థిరంగానే ఉండగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆమ్‌ఆద్మీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లగొట్టింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మరలింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నగరంలో ఒక్క సీటుకూడా దక్కలేదు. 1998 నుంచి 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీకి అది ఘోర అవమానమే అని చెప్పాలి.

కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి ఆమ్‌ఆద్మీ పార్టీ

కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి ఆమ్‌ఆద్మీ పార్టీ


ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల కోసమే కాంగ్రెస్ కృషి చేస్తుండటంతో తన ప్రధాన ప్రత్యర్థి ఆమ్‌ఆద్మీ పార్టీనే అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే గత ఐదారేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ తన ఓటు బ్యాంకును పటిష్టం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం అంతర్గత విబేధాలు, సీనియర్ నాయకుల వ్యక్తిగత లాభాల కోసం పాకులాడింది. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ నేతలు చాలా మంది వెనకడుగు వేశారు. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఆప్ మధ్య గొడవను చాలా దగ్గరగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తన ఓటుషేరును పెంచుకోగలిగితే అది బీజేపీకే లాభం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఓటు షేరు పెంచుకోవడం వల్ల కేజ్రీవాల్ పార్టీ బలం తగ్గిపోతుందని వారు అంచనా వేస్తున్నారు.

 2015లో ఒక్క ఢిల్లీలో ఖాతా తెరవని కాంగ్రెస్

2015లో ఒక్క ఢిల్లీలో ఖాతా తెరవని కాంగ్రెస్


2013 ఎన్నికల్లో ఆప్ 28 సీట్లను కైవసం చేసుకుని కింగ్ మేకర్‌గా అవతరించింది. 29.49శాతం ఓట్లు వచ్చాయి. 2015లో ఏకంగా 67 సీట్లు గెల్చుకుంది. ఆ సమయంలో 54.3 శాతం ఓట్లు లభించాయి. 2013లో కాంగ్రెస్ 8 సీట్లు సాధించి 24.55శాతం ఓటు శాతం దక్కించుకుంది. అదే 2015లో 9.8శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒక్క సీటు కూడా గెల్చుకోకపోవడం విశేషం. మరోవైపు 2013లో బీజేపీ 31 స్థానాల్లో విజయం సాధించగా 33.07శాతం ఓట్లు సంపాదించింది. 2015కు ఒక్క శాతం ఓట్లు తగ్గి 32.1శాతం వద్ద నిలిచి మూడు సీట్లు కైవసం చేసుకుంది.

ముస్లిం సామాజిక వర్గం తమవైపే ఉంటారన్న ధీమా

ముస్లిం సామాజిక వర్గం తమవైపే ఉంటారన్న ధీమా

ఇక ఫ్రిబవరి 8న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు షేరును అలానే సీట్లను కూడా పెంచుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటం ముస్లిం సామాజిక ఓటర్లను ఆకట్టుకుందని వారిలోకి చొచ్చుకుపోయిందనే విశ్వాసంను హస్తం పార్టీ వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే వారి ఓట్లు కాంగ్రెస్‌కు తప్ప మరో పార్టీకి వెళ్లవనే ధీమాతో ఉంది. అంతేకాదు ఆర్జేడీతో జట్టు కట్టడం వల్ల ఢిల్లీలో సెటిల్ అయిన బీహారీల ఓట్లు కూడా వస్తాయని కనీసం 4-5 స్థానాల్లో వారి ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు ఢిల్లీలో ప్రచారం నిర్వహించనుండగా.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఖుష్బూ, నగ్మా, మొరార్జీలు కూడా ప్రచారం నిర్వహించనున్నారు.

English summary
The Congress faces a tough challenge of getting back its vote base from the Aam Aadmi Party (AAP) in the February 8 Assembly elections in Delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X