వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెట్టింపు అయిన బీజేపీ ఆదాయం..ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2018-19లో భారతీయ జనతా పార్టీ ఆదాయం 135శాతంకు పెరిగి రూ.2410 కోట్లకు చేరిందని ఎన్నికల సంఘం వద్ద దాఖలు చేసిన ఆడిట్ నివేదిక ద్వారా తెలుస్తోంది. పార్టీల ఆర్థిక వివరాలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆయా రాజకీయ పార్టీలు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక బీజేపీ ఇన్‌కం ఈ స్థాయిలో ఉంటే మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ 2018-19లో ఆదాయం 918 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 361శాతం పెరిగినట్లు సమాచారం.

బీజేపీ మొత్తం ఆదాయం రూ.2410 కోట్లు ఉండగా అందులో రూ.1450 కోట్లు ఒక్క ఎలక్టోరల్ బాండ్ల నుంచే వచ్చినట్లు సమాచారం. ఇక 2018-19కి గాను బీజేపీ రూ.1005 కోట్లు ఖర్చు చేసినట్లు తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఎన్నికల ఖర్చుతో పాటు ఇతర సాధారణ ఖర్చులో భాగంగా రూ.792.4 కోట్లు వెచ్చించినట్లు నివేదికలో పొందుపర్చింది.

ఇక 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను బీజేపీ రూ.1027 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ ఆదాయం 2017-18తో పోలిస్తే 2018-19లో 361శాతం పెరిగింది. ఇందులో రూ.383 కోట్లు ఎలక్టోరాల్ బాండ్ల నుంచి వచ్చినదే. 2017-18లో ఎలక్టోరాల్ బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.5 కోట్లు మాత్రంగానే ఉన్నింది.

BJP income increases 135% to Rs 2,410 crore in 2018-19

ఇదిలా ఉంటే రెండు జాతీయ పార్టీలకు అత్యధిక ఆదాయం ఎలక్టోరాల్ బాండ్ల నుంచే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2018-19కి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల వార్షిక ఆదాయంను ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది కానీ ఒక్క నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్షికాదాయం లెక్కలను పొందుపర్చలేదు. అన్ని రాజకీయ పార్టీల ఆదాయాలు కలిపితే అది ఒక్క బీజేపీ ఆదాయం రూ.2410 కోట్లతో సమానం కావడం విశేషం. ఇక ఖర్చుల విషయంలో కూడా ఇతర పార్టీల కంటే బీజేపీనే 39 శాతం అధికంగా పార్టీ నిధులను ఖర్చు చేసింది.

వరుసగా గత నాలుగు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వార్షికాదాయంలో తగ్గుదల నమోదు చేస్తూ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం కాస్త పెరుగుదలను రికార్డు చేసింది. ఒక్క ఆదాయంలో మాత్రమే పెరుగుదల నమోదు చేయలేదు... షేర్లలో కూడా పెరుగుదల నమోదు చేసింది.

English summary
The Bharatiya Janata Party (BJP) income grew by whooping 135 percent to Rs 2,410 crore in 2018-19, according to financial audit reports filed by the parties with the Election Commission of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X