వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేల కొనుగోలు..?: కాంగ్రెస్ నేతలతో బీజేపీ సంప్రదింపులు, ఆధారాలు ఉన్నాయి: అశోక్ గెహ్లట్..

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్ రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. సచిన్ పైలట్ తిరుగుబాటు ఎగరేయడంతో.. విపక్ష బీజేపీ చిన్న, చితక పార్టీలు.. స్వతంత్రులతో సంప్రదింపులు జరుపుతోంది. అసెంబ్లీలో బలం లేదని, నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పనిలో పనిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. దీనిపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కామెంట్ చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

అశోక్ గెహ్లట్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్, ముంబై, ఢిల్లీలో కూడా..అశోక్ గెహ్లట్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్, ముంబై, ఢిల్లీలో కూడా..

రాజస్తాన్ అసెంబ్లీలో 200 సీట్లు ఉన్నాయి. 102 సీట్లు మెజార్టీ మార్క్ కాగా.. కాంగ్రెస్ 100 మంది సీట్లు గెలుచుకొని.. బీటీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి 73 సీట్లు గెలువగా.. సచిన్ పైలట్‌తో 18 మంది సభ్యులు ఉన్నారు. వాస్తవానికి బీజేపీ సంప్రదింపులు జరిపినా.. పైలట్ కమలదళంలో చేరేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసే ప్రయత్నం చేస్తోందని సమాచారం పొక్కింది.

BJP involved in horse-trading, Congress has proof: Ashok Gehlot

Recommended Video

#Lockdown : దేశంలో పెరుగుతున్న Corona కేసులు.. ఒక్కరోజే 30వేలు, మళ్లీ Lockdown దిశగా రాష్ట్రాలు..!

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరిపిందని గెహ్లట్ పేర్కొన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఆఫర్ చేసిందని శనివారం కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ఆ వ్యాఖ్యలను రిపీట్ చేశారు. దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. అందుకోసమే తమ ఎమ్మెల్యేలను హోటల్లో ఉంచామని తెలిపారు. లేదంటే ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు రాజస్తాన్‌లో కూడా అధికారం చేతులు మార్చే ప్రయత్నం చేసేవారు అని తెలిపారు.

English summary
Rajasthan CM Ashok Gehlot on Wednesday accused the BJP of horse-trading in the state, while adding that the Congress has proof of the same
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X