వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం ఆనంది బెన్ అవుట్..! : కొత్త సీఎం ఆయనేనట

|
Google Oneindia TeluguNews

గుజరాత్ లో పార్టీ ప్రక్షాళనకు బీజేపీ సన్నద్దమవుతోన్నట్టుగా తెలుస్తోంది. యుద్ద ప్రాతిపదికన రాష్ట్ర నాయకత్వాన్ని మార్చేయాలనే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ప్రక్షాళనలో భాగంగా.. ఏకంగా ప్రస్తుత సీఎం ఆనందిబెన్ ను సీఎం కుర్చీ నుంచి దించేసి, ఆ స్థానంలో నితిన్ భాయ్ పటేల్ కు అవకాశం ఇవ్వాలనేది బీజేపీ వర్గాల ఆలోచనగా తెలుస్తోంది.

అయితే.. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను అదుపు చేయడంలో సీఎం ఆనంది బెన్ విఫలమైనందుకే ఈ నిర్ణయం తీసుకున్నటుటగా సమాచారం. ప్రతిసారి జాతీయ నాయకత్వం జోక్యం చేసుకుని నేతల మధ్య సఖ్యతను ఏర్పరచడం కష్టమవుతండడంతో, రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడం ద్వారానే దీనికి చెక్ పెట్టవచ్చు అనే అభిప్రాయానికి వచ్చాయట బీజేపీ వర్గాలు.

bjp is going to replace gujarat cm

ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో.. ఇప్పటినుంచే పార్టీని పటిష్టపరచాలనే ప్రయత్నాల్లో మునిగిపోయింది బీజేపి. అందకు తగ్గట్టుగానే పార్టీకి బలహీనతగా మారినవారిపై వేటు వేయాలనే ఉద్దేశంతో ఆనంది బెన్ ను సీఎం కుర్చీ నుంచి దించేస్తారనే జోరందుకుంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టేసి, అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీ మైలేజ్ ను మరింత పెంచాలని చూస్తున్నాయి బీజేపీ జాతీయ వర్గాలు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే ఓ గుజరాత్ మాజీ సీఎం నివేదిక తయారు చేసి ప్రధాని మోడీకి అందించినట్టుగా సమాచారం. కాగా.. గుజరాత్ లో సీఎం ని మార్చితే కేంద్ర కేబినెట్ లోను పలు మార్పులు చోటు చేసుకోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
according to the national politics round up the bjp is going to replace the gujarat cm
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X