బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెబల్ ఎమ్మెల్యేలను వాడేసుకుంటున్నారు: మీ జీవితాలు నాశనం, డీకేశీ, చివరి ప్రయత్నం !

|
Google Oneindia TeluguNews

Recommended Video

రెబల్ MLAలు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నDK శివకుమార్ | MLAs Should Not Fell Into BJPs Trap

బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ముంబైలోని స్టార్ హోటల్ లో మకాం వేసిన కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలకు నచ్చచెప్పడానికి మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మిమ్మల్ని బీజేపీ నాయకులు వాడేసుకుంటున్నారని, ఇప్పటికైనా వారి కుట్రల నుంచి బయటపడాలని, మీ జీవితాలు నాశనం చేసుకోరాదని మంత్రి డీకే. శివకుమార్ మనవి చేశారు.

బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన మంత్రి డీకే శివకుమార్ రెబల్ ఎమ్మెల్యేలను అమాయకులను చేసి బీజేపీ నాయకులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. మీ గురించి బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు, మిమ్మల్ని మంత్రులు చెయ్యరని, ఇది నిజం అని మంత్రి డీకే. శివకుమార్ అన్నారు.

BJP is misusing dissident MLAs to form government said minister DK Shivakumar.

ఇప్పటికైనా బెంగళూరు చేరుకుని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మంత్రి డీకే. శివకుమార్ రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి డీకే. శివకుమార్ మనవి చేశారు. మీ రాజీనామాలు స్పీకర్ అంగీకరించలేదని, అనర్హత వేటు పడితే మీ జీవితాలు నాశనం అవుతాయని, అలా జరగకుండా మీరే జాగ్రత్త పడాలని మంత్రి డీకే. శివకుమార్ అన్నారు.

గవర్నర్ వాజూబాయ్ వాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి రాసిన లేఖ గురించి మంత్రి డీకే. శివకుమార్ మాట్లాడారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. అయితే గవర్నర్ రాసిన లేఖలో సీఎంకు సంపూర్ణ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేదని అన్నారని, ఆయన పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్లు ఉందని మంత్రి డీకే. శివకుమార్ ఆరోపించారు.

సుప్రీం కోర్టు బీజేపీకి సహాయం చేస్తోందని బీజేపీ నాయకుడు మధుస్వామి అంటున్నారని మంత్రి డీకే. శివకుమార్ ఆరోపించారు. సుప్రీం కోర్టు పేరు చెప్పి బీజేపీ పబ్బం గడుపుకుంటోందని మంత్రి డీకే. శివకుమార్ ఆరోపించారు. బీజేపీ నాయకులకు సుప్రీం కోర్టు అడ్డుకట్ట వేయాలని మంత్రి డీకే. శివకుమార్ మనవి చేశారు.

English summary
BJP is misusing dissident MLAs to form government said minister DK Shivakumar. He also requested dissident MLAs that should not fell into BJPs trap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X