వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్ధరాత్రి అసెంబ్లిలో ధర్నా చేసిన ఎంఎల్ఏలు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నిజాయితీ ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. రవి మృ తి కేసు అధికార కాంగ్రెస్ పార్టికి తలనొప్పిగా మారింది. ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తు మంగళవారం రాత్రి పూర్తిగా శాసన సభ, శాసన మండలిలో సభ్యలు ధర్నా నిర్వహించి బుధవారం ఉదయం వరకు అక్కడే గడిపారు.

మంగళవారం సాయంత్రం శాసన సభ, శాసన మండలిలో డికె రవి కేసు సీబీఐకి అప్పగించాలని బీజేపీ, జేడీఎస్ శాసన సభ్యులు, ఎంఎల్ సీలు ధర్నా నిర్వహించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేసు సీఐడితో దర్యాప్తు చేయిస్తామని చెప్పింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు వెనక్కు తగ్గలేదు.

తమ డిమాండ్ తీర్చకుంటే రాత్రి మొత్తం ఇక్కడే ధర్నా నిర్వహిస్తామని మాజీ హొం శాఖ మంత్రి ఆర్. అశోక్ తేల్చి చెప్పారు. అధికార పార్టీ నాయకులు పట్టించుకొకుండ వెళ్లిపోవడంతో రాత్రి పూర్తిగా శాసన సభ, శాసన మండలిలో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు ధర్నా నిర్వహించారు. మాజీ డిప్యూటి సీఎం ఈశ్వరప్ప ఆధ్వర్యంలో రాత్రి పూర్తిగా ధర్నా నిర్వహించారు. ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు అక్కడికే భోజనాలు పంపించారు.

రాత్రి పూర్తిగా ధర్నా

రాత్రి పూర్తిగా ధర్నా

బీజేపీ, జేడీఎస్ శాసన సభ్యులు, ఎంఎల్సీలు శాసన సభలో రాత్రంతా ధర్నా నిర్వహించారు. డి.కే. రవి కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

డి.కే. రవి కుటుంబానికి న్యాయం చెయ్యండి

డి.కే. రవి కుటుంబానికి న్యాయం చెయ్యండి

డి.కే. రవి కుటంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ మాజీ డిప్యూటి సీఎం ఈశ్వరప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు

రాజీకి రాబోమని తేల్చి చెప్పారు

రాజీకి రాబోమని తేల్చి చెప్పారు

అర్దరాత్రి ధర్నా జరుగుతున్న చోటకు శాసన సభ స్పీకర్ కాగోడు తిమ్మప్ప, విధాన పరిషత్ ఉప సభాపతి ఎస్.ఆర్ పాటిల్ వెళ్లారు. సీఎం సిద్దరామయ్య న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ధర్నా విరమించాలని చెప్పినా ఫలితం లేకపోయింది.

భోజనాలు పంపించిన ప్రభుత్వం

భోజనాలు పంపించిన ప్రభుత్వం

ధర్నా చేస్తున్న బీజేపీ, జేడీఎస్ శాసన సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం భోజనాలు పంపించింది. అదే విధంగా వారికి పడుకోవడానికి దుప్పట్లు, తలదిండ్లు అందించారు. పడుకుని ధర్నా చేస్తున్న ఎంఎల్సీ.

అంత్యక్రియల నుండి నేరుగా వెళ్లిన శెట్టర్

అంత్యక్రియల నుండి నేరుగా వెళ్లిన శెట్టర్

డి.కే. రవి అంత్యక్రియలలో పాల్గోన్న మాజీ సీఎం జగదీష్ శెట్టర్ నేరుగా విదానసౌధ చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. మాజీ హొంశాఖ మంత్రి ఆర్. అశోక్, శాసన సభ్యులు సురేష్ కుమార్, విశ్వనాథ్ తదితరులు దర్నాలో పాల్గొన్నారు.

దేశభక్తిగీతాలు

దేశభక్తిగీతాలు

విధాన పరిషత్ లో ఈశ్వరప్ప ఆధ్వర్యంలో బీజేపీ సభ్యులు, బసవరాజ్ హొరట్టి ఆధ్వర్యంలో జేడీఎస్ సభ్యలు ధర్నా నిర్వహించారు. ఇదే సంధర్బంలో దేశభక్తి గీతాలు ఆలపించి రవి ఆత్మ శాంతించాలని నివాళులు అర్పించారు.

English summary
Demanding a CBI probe in IAS officer DK Ravi's death, BJP MLAs' on Tuesday night continued a long protest at Karnataka Assembly. HD Kumaraswamy, JDS, accused Chief Minister Siddaramaiah of ... We will continue our protest until Govt orders CBI inquiry into IAS officer DK Ravi's death case.”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X