వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయకాంత్, రజనీకాంత్‌లను దువ్వుతున్న బిజెపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

BJP keen on alliance with DMDK
చెన్నై: 2014 సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా ఢిల్లీ గద్దెనెక్కాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు సాధ్యమయ్యే అన్ని అవకాశాలను వినియోగించుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా డిఎండికె అధ్యక్షులు విజయకాంత్‌ను దువ్వుతోంది. ఉత్తర భారతదేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ హవా కనిపిస్తోంది. దానికి తోడు పలువురు ప్రముఖులు బిజెపిలో చేరుతున్నారు. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

దక్షిణాదిన కూడా పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‌కు కూడా బిజెపి గాలం వేస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. శనివారం తమిళనాడులోని తిరుచ్చిలో భారతీయ జనతా పార్టీ లోకసభ ఎన్నికల కార్యాచరణ సంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు అధ్యక్షత వహించారు.

అనంతరం పోన్ రాధాకృష్ణ విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మోడీ హవా వీస్తోందన్నారు. ఆ ప్రభావం తమిళనాడులోని బలంగా ఉందన్నారు. బిజెపి తన బలాన్ని పెంచుకొని కేంద్రంలోను, రాష్ట్రంలోను అధఇకారం చేపట్టనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో ఇతర పార్టీలతో కూటమికి ప్రయత్నిస్తున్నామన్నారు.

ఇప్పటికే ఎండిఎంకెతో చర్చలు ముగిశాయని, విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెతో చర్చిస్తున్నట్లు చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖుల మద్దతు కోరుతామని రాధాకృష్ణ చెప్పారు. విజయకాంత్ బిజెపితో కలిసి నడుస్తారని భావిస్తున్నామన్నారు. విజయకాంత్ సరైన నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నామని రాధాకృష్ణ అన్నారు.

English summary

 A day after the PMK leader S Ramadoss lashed out at the DMDK, Tamil Nadu BJP president Pon Radhakrishnan expressed hope that actor Vijayakanth would be a part of the BJP alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X